INDW vs PAKW : పాక్‌తో మ్యాచ్.. టీమ్ఇండియా ఫస్ట్ బ్యాటింగ్.. తుది జట్టులో ఓ మార్పు..
వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా భారత్, పాకిస్తాన్ (INDW vs PAKW) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.

Pakistan Women opt to bowl in ODI World Cup 2025 against India Women
INDW vs PAKW : వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు కొలంబో ఆతిథ్యం ఇస్తోంది. ఇటీవల పురుషుల ఆసియాకప్‌లో ఇరు జట్ల మధ్య వివాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మహిళల మ్యాచ్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది.
టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. కాగా.. భారత జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. లంక పై అర్థశతకం బాదిన అమన్ జ్యోత్ స్థానంలో పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చింది.
భారత తుది జట్టు..
ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), జేమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ్ రాణా, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి
🚨 Toss & Playing XI 🚨#TeamIndia have been put in to bat first in Colombo 👍
One change as Renuka Singh Thakur comes in 🙌
Updates ▶️ https://t.co/9BNvQl3J59#WomenInBlue | #CWC25 pic.twitter.com/96HPbFaoig
— BCCI Women (@BCCIWomen) October 5, 2025
Ravindra Jadeja : కోహ్లీ, అశ్విన్‌లను అధిగమించిన రవీంద్ర జడేజా.. ఇక మిగిలింది సచిన్ మాత్రమే..
పాకిస్తాన్ తుది జట్టు..
మునీబా అలీ, సదాఫ్ షర్మాస్, సిద్రా అమిన్, అలియా రియాజ్, సిద్రా నవాజ్ (వికెట్ కీపర్), ఫాతిమా సనా (కెప్టెన్), నటాలియా పర్వేజ్, డయానా బేగ్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్