ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్.. చైనా జెండాతో పాకిస్థాన్ ఆట‌గాళ్లు.. విజేత‌గా నిలిచిన భార‌త్‌.. సోష‌ల్ మీడియాలో..

చైనా వేదిక‌గా జ‌రిగిన ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌గా భార‌త హాకీ జ‌ట్టు నిలిచింది.

ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్.. చైనా జెండాతో పాకిస్థాన్ ఆట‌గాళ్లు.. విజేత‌గా నిలిచిన భార‌త్‌.. సోష‌ల్ మీడియాలో..

Pakistani Players Hold Chinese Flags at Asian Champions Trophy Final

Updated On : September 17, 2024 / 8:45 PM IST

Pakistan Players Hold China Flag : చైనా వేదిక‌గా జ‌రిగిన ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌గా భార‌త హాకీ జ‌ట్టు నిలిచింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆతిథ్య చైనా పై 1-0 తేడాతో గెలుపొందింది. రికార్డు స్థాయిలో ఐదోసారి ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీని భార‌త్ ముద్దాడింది. దీంతో తొలిసారి ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌గా నిల‌వాల‌ని భావించిన చైనాకు గ‌ట్టి షాక్ త‌గిలింది. భార‌త్ త‌రుపున నమోదైన ఏకైక గోల్‌ను జుగ్రాజ్ సింగ్ 50వ నిమిషంలో న‌మోదు చేశాడు.

మ‌రోవైపు మూడోస్థానం కోసం జ‌రిగిన ప్లేఆఫ్‌లో ద‌క్షిణ‌కొరియాను పాకిస్థాన్ 5-2 తేడాతో ఓడించింది. పాక్ త‌రుపున సుఫ్యాన్ ఖాన్ (38వ నిమిషం, 49వ నిమిషం), హన్నన్ షాహిద్ (39వ నిమిషం, 54వ‌నిమిషం), రూమన్ (45వ నిమిషంలో)లు గోల్స్ చేశారు. ద‌క్షిణ‌కొరియా త‌రుపున‌ జంగ్‌జున్ లీ (16వ నిమ‌షంలో), జిహున్ యాంగ్ (40వ నిమిషంలో) గోల్స్ చేశారు.

IND vs BAN : భార‌త్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌.. ఫ్రీగా మ్యాచుల‌ను ఎక్క‌డ‌ చూడొచ్చొ తెలుసా?

ఇదిలా ఉంటే.. ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్‌, చైనాలు త‌ల‌ప‌డుతుంటే పాకిస్థాన్ ప్లేయ‌ర్లు మ్యాచ్‌ను మైదానంలోంచే వీక్షించారు. అయితే.. పాక్ ఆట‌గాళ్లు చైనాకు మ‌ద్ద‌తుగా చైనా జెండాల‌ను ప‌ట్టుకుని కూర్చుకున్నారు. దీంతో వారు ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తున్నారో స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంద‌ని వ్యాఖ్యాత అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ఇక్క‌డ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే సెమీఫైన‌ల్‌లో పాకిస్థాన్ జ‌ట్టు చైనా చేతిలోనే ఓడిపోయింది.

Neeraj Chopra : నీర‌జ్ చోప్రాను ఫోన్ నంబ‌ర్ అడిగిన లేడీ ఫ్యాన్.. మ‌నుభాకర్‌కు తెలిస్తే?