Haris Rauf : స్టార్ ఆట‌గాడిపై పీసీబీ క‌ఠిన చ‌ర్య‌లు.. ఆ ప‌ని చేయ‌డంతోనే!

పాకిస్తాన్ స్టార్ పేస‌ర్ హారిస్ రౌఫ్‌కు ఆ దేశ్ క్రికెట్ బోర్డు షాకిచ్చింది.

Haris Rauf : స్టార్ ఆట‌గాడిపై పీసీబీ క‌ఠిన చ‌ర్య‌లు.. ఆ ప‌ని చేయ‌డంతోనే!

PCB terminates Haris Rauf's central contract for not committing to Australia tour

Updated On : February 15, 2024 / 11:33 PM IST

పాకిస్తాన్ స్టార్ పేస‌ర్ హారిస్ రౌఫ్‌కు ఆ దేశ్ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. ఇటీవ‌ల పాకిస్తాన్ జ‌ట్టు ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టించ‌గా ఆ ప‌ర్య‌ట‌న‌కు హారిస్ దూరంగా ఉన్నాడు. ఎటువంటి గాయం కాన‌ప్ప‌టికీ ఉద్దేశ పూర్వకంతో అత‌డు ప‌ర్య‌టన నుంచి త‌ప్పుకోవ‌డంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అత‌డి పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంది. అత‌డి సెంట్ర‌ల్ కాంట్రాక్టును ర‌ద్దు చేసింది. అంతేకాదు.. ఈ ఏడాది జూన్ వ‌ర‌కు అత‌డు ఎటువంటి విదేశీ టీ20 లీగ్‌లు ఆడకుండా చేసింది.

ఇటీవ‌ల పాకిస్తాన్ ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టించింది. ఈ ప‌ర్య‌ట‌న నుంచి ఆఖ‌రి నిమిషంలో హారిస్ త‌ప్పుకున్నాడు. సిరీస్‌లో ఆడాల‌ని 10-15 ఓవ‌ర్లు బౌలింగ్ చేసినా చాలు అని టీమ్‌మేనేజ్‌మెంట్ అత‌డికి చెప్పిన‌ప్ప‌టికీ ఇందుకు అత‌డు అంగీకారం తెల‌ప‌లేదు. అత‌డికి ఎటువంటి గాయం కాలేదు. మెడిక‌ల్ బృందం కూడా అత‌డు ఫిట్‌గా ఉన్నాడ‌ని బోర్డుకు నివేదిక ఇచ్చింది. సిరీస్‌కు ఆడ‌కుండా బిగ్‌బాష్ లీగ్‌లో ఆడాడు. దీంతో పీసీబీ అత‌డిపై సీరియ‌స్ అయ్యింది.

Ravindra Jadeja : త‌ప్పునాదే.. స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ర‌వీంద్ర జ‌డేజా..

అత‌డి నుంచి వివ‌ర‌ణ కోరింది. అత‌డు ఇచ్చిన వివ‌ర‌ణ‌పై పీసీబీ సంతృప్తి చెంద‌లేదు. ఓ ఆట‌గాడికి పాకిస్తాన్ జ‌ట్టు త‌రుపున ఆడ‌డ‌మే అన్నింటిక‌న్నా ఎంతో గౌర‌వం. ఉద్దేశ్య‌పూర్వ‌కంగా త‌ప్పుకోవ‌డంతో పాటు స‌రైన వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోవ‌డం అనేది సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ రూల్స్‌ను ఉల్లంఘించ‌డ‌మే. అందుకే అత‌డి కాంట్రాక్టును ర‌ద్దు చేస్తున్నాం అని పీసీబీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. జూన్ 30, 2024 వ‌ర‌కు విదేశీ లీగుల్లో ఆడేందుకు ఎన్‌వోసీ ఇవ్వ‌మ‌ని చెప్పింది.

ఆసీస్ ప‌ర్య‌ట‌న‌లో పాకిస్తాన్ ఘోర ప్ర‌ద‌ర్శ‌న చేసింది. టెస్టు సిరీస్‌ను 0-3తో, టీ20సిరీస్‌ను 1-4తో కోల్పోయింది.