Pakistan Win: భార్య పాకిస్తాన్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందని పోలీస్ కంప్లైంట్

టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా అక్టోబర్ 24న జరిగిన మ్యాచ్ లో టీమిండియాపై విజయం సాధించింది పాకిస్తాన్. భారత అభిమానులు ఒకింత నిరుత్సాహానికి గురికాగా పాక్ అభిమానులు సంబరాలు....

Pakistan Win: భార్య పాకిస్తాన్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందని పోలీస్ కంప్లైంట్

Team India Lossx

Updated On : November 7, 2021 / 10:00 AM IST

Pakistan Win: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా అక్టోబర్ 24న జరిగిన మ్యాచ్ లో టీమిండియాపై విజయం సాధించింది పాకిస్తాన్. భారత అభిమానులు ఒకింత నిరుత్సాహానికి గురికాగా పాక్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఇండియాలో ఉండి పాకిస్తాన్ విక్టరీని సెలబ్రేట్ చేసుకోవడంపై పలు కేసులు నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో తన భార్యపైనే కంప్లైంట్ చేశాడో వ్యక్తి.

‘ఇండియా జట్టుపై పాకిస్తాన్ టీం గెలిచిందని సెలబ్రేట్ చేసుకుంటుందని తన భార్యపైనే కంప్లైంట్ చేశాడు ఆ వ్యక్తి’ అని ఎస్పీ అంకిత్ మిట్టల్ అన్నారు. రాంపూర్ లోని అజీమ్ నగర్ కు చెందిన ఇషాన్ మియా అనే వ్యక్తి తన భార్య రబియా షంశీ ఆమె కుటుంబ సభ్యులు కలిసి టపాకాయలు పేల్చుకుని మరీ పాకిస్తాన్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడంపై ఫిర్యాదు చేశాడు.

రాంపూర్ జిల్లాలోని గంజ్ పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 153-A ప్రకారం.. ఎఫ్ఐఆర్ నమోదైంది.

………………………………………. : ఆరాధించే నేతల్లో మోదీ టాప్ ప్లేస్

పెళ్లి తర్వాత కొన్నాళ్లకే విడిగా ఉంటున్నారు భార్యభర్తలు. పుట్టింటికి వెళ్లిపోయిన మహిళ పేరెంట్స్ తో పాటు కలిసి ఉంటుంది. వారిద్దరి మధ్య విడాకుల కేసు కూడా నడుస్తుంది. దీనిపై విచారణ జరుగుతుందని పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.