Preity Zinta : పంజాబ్ కింగ్స్ యాజ‌మాన్యంలో విభేదాలు.. కోర్టుకెక్కిన ప్రీతి జింటా..

పంజాబ్ కింగ్స్ స‌హ య‌జ‌మాని, బాలీవుడ్ న‌టి ప్ర‌తీ జింటా న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించింది.

Preity Zinta : పంజాబ్ కింగ్స్ యాజ‌మాన్యంలో విభేదాలు.. కోర్టుకెక్కిన ప్రీతి జింటా..

Updated On : May 23, 2025 / 12:25 PM IST

పంజాబ్ కింగ్స్ స‌హ య‌జ‌మాని, బాలీవుడ్ న‌టి ప్ర‌తీ జింటా న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించింది. చండీగ‌ఢ్ కోర్టులో పంజాబ్ జ‌ట్టు స‌హ డెరెక్ట‌ర్లు అయిన మోహిత్ బర్మన్, నెస్ వాడియాల‌పై ఆమె కేసు వేసింది. రూల్స్‌కు విరుద్ధంగా వీరు స‌మావేశాన్ని నిర్వ‌హించార‌ని పిటిష‌న్‌లో పేర్కొంది.

మోహిత్ బర్మన్, నెస్ వాడియా, ప్రీతి జింటాలు కెపిహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నారు. ఐపీఎల్‌లోని పంజాబ్ కింగ్స్ జ‌ట్టు ఈ కంపెనీదే. ఏప్రిల్ 21న జరిగిన స‌ర్వ‌స‌భ్య స‌మావేశం చట్టబద్ధతను ప్రీతి జింటా సవాలు చేశారు. కంపెనీల చట్టం 2013 ప్ర‌కారం.. సరైన విధానాలను పాటించకుండా ఈ సమావేశం జరిగిందని ఆమె పేర్కొంది.

SRH vs RCB : ఇచ్చిన మాట‌ను పాట్ క‌మిన్స్‌ నిల‌బెట్టుకుంటాడా? ఆర్‌సీబీతో స‌న్‌రైజ‌ర్స్‌ మ్యాచ్ నేడే..

ఈ స‌మావేశానికి సంబంధించిన అభ్యంత‌రాల‌ను తాను ఏప్రిల్ 10న‌నే ఈమెయిల్ రూపంలో తెలియ‌జేసిన‌ట్లు తెలిపింది. అయితే.. వాటిని ప‌ట్టించుకోలేద‌ని చెప్పింది. నెస్ వాడియా మద్దతుతో మోహిత్ బర్మన్ సమావేశాన్ని కొనసాగించారని ఆమె ఆరోపించింది.

జింటాతో పాటు మరొక డైరెక్టర్ కరణ్ పాల్ సమావేశానికి హాజరైనప్పటికీ.. ఈ స‌మావేశం చ‌ట్ట‌బ‌ద్ధ‌త చెల్ల‌ద‌ని ప్ర‌క‌టించాల‌ని ప్రీతా జింటా న్యాయ‌స్థానాన్ని కోరింది. ఈ మీటింగ్‌లో మునీశ్‌ ఖన్నాను డైరెక్ట‌ర్‌గా నియ‌మించడాన్ని ఆమె వ్య‌తిరేకించారు. వెంట‌నే డైరెక్ట‌ర్‌గా ఖ‌న్నా నియామ‌కాన్ని నిలిపివేయాల‌ని పిటిష‌న్‌లో ప్రీతి జింటా కోరింది. కేసు పరిష్కారం అయ్యే వరకు తాను, కరణ్ పాల్ లు లేకుండా బోర్డు స‌మావేశాలు నిర్వ‌హించ‌కుండా చూడాల‌ని కోరారు.

GT vs LSG : గుజ‌రాత్ పై విజ‌యం.. ల‌క్నో ఓన‌ర్ సంజీవ్ గొయెంకా ట్వీట్ వైర‌ల్‌.. మ‌ళ్లీ..

సమస్యలు ఉన్నప్పటికీ ప్రీతి జింటా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025లో పంజాబ్ ఆడే మ్యాచ్‌ల‌కు హాజ‌రవుతూ జ‌ట్టుకు మ‌ద్దతు ఇస్తూనే ఉంది. ఈ సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ అద‌ర‌గొడుతోంది. శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో ప్లేఆఫ్స్‌కు దూసుకువెళ్లింది. 2014 త‌రువాత ప్లేఆఫ్స్‌కు చేరుకోవ‌డం పంజాబ్‌కు ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.