IPL 2025: ఏంది బ్రో ఇదీ.. మరీ ఇంత దారుణమా..! గ్లెన్ మాక్స్‌వెల్ పై ఫ్యాన్స్ ఫైర్.. అసలేం జరిగిందంటే?
పంజాబ్ కింగ్స్ జట్టు ఈ సీజన్ లో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్ లు ఆడి.. ఐదు మ్యాచ్ లలో విజయం సాధించింది.

Glenn Maxwell
IPL 2025 Glenn Maxwell: ఐపీఎల్-2025 సీజన్ లో వేలంలో భారీ మొత్తంకు కొనుగోలు చేసిన కొందరు ఆటగాళ్లు ఫ్యాన్స్ అంచనాలకు విరుద్దంగా పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. వీరిలో పంజాబ్ కింగ్స్ జట్టు ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఒకరు. ఆస్ట్రేలియాకు చెందిన మాక్స్‌వెల్ ఈ సీజన్ లో పరుగులు రాబట్టడంలో విఫలమవుతున్నాడు.
ఐపీఎల్ వేలంలో గ్లెన్ మాక్స్‌వెల్‌ను పంజాబ్ కింగ్స్ జట్టు 4.20 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, అతను ఆశించిన స్థాయిలో రాణించడం లేదని పంజాబ్ కింగ్స్ జట్టు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో మాక్స్‌వెల్ ఆరు ఇన్నింగ్స్ ల్లో ఎనిమిది సగటు, 97.95 స్ట్రైక్ రేట్ తో కేవలం 48 పరుగులు మాత్రమే చేయగలిగాడు. శనివారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ లో మాక్స్‌వెల్ కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వేసిన బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. దీంతో ఫ్యాన్స్ తోపాటు మాజీ క్రికెటర్లు మాక్స్ వెల్ ఆటతీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read: IPL 2025: ఐపీఎల్ -2025లో అదరగొడుతున్న బౌలర్లు వీరే.. ఇప్పటి వరకు ఎన్ని డాట్ బాల్స్ వేశారో తెలుసా..?
ఐపీఎల్ 2025 సీజన్ లో మాక్స్‌వెల్ అత్యధిక స్కోర్ 30 పరుగులు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను మంచి ఫామ్‌లో కనిపించాడు. 21 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ తో 30 పరుగులు చేశాడు. మిగిలిన మ్యాచ్ లలో సింగిల్ డిజిట్ పరుగులకే మాక్స్ వెల్ పెవిలియన్ బాటపట్టాడు. భారత మాజీ బ్యాటర్ సురేష్ రైనా మాక్స్ వెల్ బ్యాటింగ్ తీరును విమర్శించాడు. “గ్లెన్ మాక్స్ వెల్ జట్టు తరపున చివరిసారిగా ఎప్పుడు పరుగులు చేశాడో నాకు గుర్తులేదు, అతనికి చాలా అవకాశాలు వచ్చాయి.” అంటూ వ్యాఖ్యానించాడు.
Timber Strike! \|/ ☝
Varun Chakaravarthy shows his class with a 🔝 delivery to dismiss Glenn Maxwell 👏
Updates ▶ https://t.co/oVAArAaDRX #TATAIPL | #KKRvPBKS | @KKRiders pic.twitter.com/WEigiJQQyL
— IndianPremierLeague (@IPL) April 26, 2025
పంజాబ్ కింగ్స్ జట్టు ఈ సీజన్ లో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్ లు ఆడి.. ఐదు మ్యాచ్ లలో విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో పాయింట్ల పట్టికలో 11 పాయింట్లతో నాల్గో స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ కు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. ఇకముందు జరిగే మ్యాచ్ లలో గ్లెన్ మాక్స్ వెల్ ఏమేరకు రాణిస్తారనేది చూడాల్సిందే.