PV Sindhu – Tokyo Olympics 2020: సింధు గెలిచింది.. సెమీస్‌లోకి తెలుగు తేజం

ఇండియన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు దూసుకుపోతున్నారు. సెమీ ఫైనల్ లోకి ఎంటర్ అయిపోయారు. శుక్రవారం జపాన్ కు చెందిన అకానె యమగూచిపై 21-13, 22-20తేడాతో అద్భుతమైన విజయం సాధించారు.

PV Sindhu – Tokyo Olympics 2020: సింధు గెలిచింది.. సెమీస్‌లోకి తెలుగు తేజం

New Project (1)

Updated On : July 30, 2021 / 3:23 PM IST

PV Sindhu – Tokyo Olympics 2020: ఇండియన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు దూసుకుపోతున్నారు. మెగా ఈవెంట్లో వరుస విజయాలతో సెమీ ఫైనల్ లోకి ఎంటర్ అయిపోయారు. శుక్రవారం జపాన్ కు చెందిన అకానె యమగూచిపై 21-13, 22-20తేడాతో అద్భుతమైన విజయం సాధించారు. తొలి సెట్లో దూసుకెళ్లిన సింధుకు రెండో సెట్లో టఫ్ ఫైట్ ఎదుర్కొన్నారు. సెమీస్ కు చేరాలనే కసితో కనిపించిన సింధు.. చివర్లో పుంజుకుని సత్తా చాటారు.

గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో 12వ ర్యాంక్‌ బ్లిచ్‌ఫెల్ట్‌ (డెన్మార్క్‌)ను 21-15, 21-13 తేడాతో చిత్తు చేసి వరుసగా మూడో విజయం అందుకున్నారు. రెండో రౌండ్లో లయ అందుకున్న సింధు అదే జోరును నాకౌట్లోనూ ప్రదర్శించింది. 40 నిమిషాల్లోనే ప్రత్యర్థిని కంగుతినిపించింది. బ్లిచ్‌ఫెల్ట్‌పై ఉన్న ఆధిక్యాన్ని సింధు 5-1కి పెంచుకుంది. మొత్తం 40 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ ముగిసింది.