ఇక రాజస్థాన్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ మరోసారి పగ్గాలు అందుకున్నాడు.

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ మరోసారి పగ్గాలు అందుకున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ మరోసారి పగ్గాలు అందుకున్నాడు. 2019సీజన్ ఆరంభం నుంచి అజింకా రహానె కెప్టెన్సీలో గెలిచింది కేవలం 2మ్యాచ్‌లు మాత్రమే. గత వైభవాన్ని రాజస్థాన్‌కు తిరిగి అందించాలనే ఉద్దేశ్యంతో స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్ చేసింది రాజస్థాన్.
ఇక నుంచి సీజన్ మొత్తం స్మిత్‌యే కెప్టెన్. ఆస్ట్రేలియా బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత 2018 సీజన్‌లో రాజస్థాన్‌కు దూరమైన స్మిత్.. 2019సీజన్లో 8మ్యాచ్‌ల వరకూ జట్టులో సాధారణ ప్లేయర్ గానే కొనసాగాడు. ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిన కీలక పరిస్థితుల్లో రాజస్థాన్ నిలిచింది. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని సవాయ్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో ఏప్రిల్ 20 శనివారం సాయంత్రం 4గంటలకు జరిగే మ్యాచ్‌కు గంట ముందే స్మిత్ కెప్టెన్ అంటూ సంచలన ప్రకటన చేసింది.
‘అజింకా రహానె ఓ రాయల్ ప్లేయర్. 2018లో చాలెంజింగ్ పరిస్థితుల్లోనూ జట్టును ప్లే ఆఫ్ వరకూ నడిపించాడు. ఇప్పటికీ జట్టులో కీలక ప్లేయర్‌గానే కొనసాగుతాడు. స్టీవ్ స్మిత్‌కు అవసరమైన సందర్భాల్లో తన నాయకత్వాన్ని పంచుకుంటాడు. స్టీవ్ స్మిత్ అంతర్జాతీయ కెప్టెన్లలో ఒకరు. జట్టును ఇంకా విజయవంతంగా నడిపిస్తాడనే నమ్మకం ఉంది’ అంటూ రాజస్థాన్ రాయల్స్ హెడ్ జుబిన్ భరుచా తెలిపాడు.
Also Read : BCCI విలక్షణ తీర్పు : పాండ్యా..రాహుల్‌కు రూ. 20 లక్షల ఫైన్