RCB : అఫీషియ‌ల్‌.. ఆర్‌సీబీ కొత్త‌ కెప్టెన్‌గా ర‌జ‌త్ పాటిదార్‌.. బెంగ‌ళూరు చిర‌కాల కోరిక నెర‌వేరేనా?

ఐపీఎల్ 2025 సీజన్‌కు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌మ కెప్టెన్ ను ప్ర‌క‌టించింది.

RCB : అఫీషియ‌ల్‌.. ఆర్‌సీబీ కొత్త‌ కెప్టెన్‌గా ర‌జ‌త్ పాటిదార్‌.. బెంగ‌ళూరు చిర‌కాల కోరిక నెర‌వేరేనా?

Rajat Patidar is New Captain for Rcb

Updated On : February 13, 2025 / 11:59 AM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) త‌మ జ‌ట్టు కెప్టెన్ ను ప్ర‌క‌టించింది. యువ ఆట‌గాడు ర‌జ‌త్ పాటిదార్‌కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. ఈ మేర‌కు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ మేనేజ్‌మెంట్ నుంచి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది.

పాటిదార్ 2021 నుంచి ఆర్‌సీబీ జ‌ట్టులో భాగంగా ఉన్నాడు. ఇటీవ‌ల మెగా వేలానికి కన్నా ముందు ఆర్‌సీబీ రిటైన్ చేసుకున్న ముగ్గురు ఆట‌గాళ్ల‌లో అత‌డు ఒక‌డు. ఇప్ప‌టి వ‌ర‌కు పాటిదార్ ఐపీఎల్‌లో 27 మ్యాచ్‌లు ఆడి 34.7 స‌గ‌టుతో 158.8 స్ట్రైక్‌రేటుతో 799 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ సెంచ‌రీ, 7 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 112.

Rohit Sharma : కెప్టెన్సీలో చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. ఎంఎస్ ధోని, కోహ్లీల రికార్డులు బ్రేక్‌..

కెప్టెన్సీ అనుభవం..

పాటిదార్‌కు కొంత కెప్టెన్సీ అనుభవం ఉంది. 2024-2025 స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు నాయ‌క‌త్వం వ‌హించాడు. త‌న జ‌ట్టును ఫైన‌ల్‌కు చేర్చాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో 428 ప‌రుగుల‌తో టోర్నీలో రెండో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాడిగానూ నిలిచాడు.

IND vs ENG : ఇంగ్లాండ్‌తో వ‌న్డే సిరీస్‌.. బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఎవ‌రికో తెలుసా?

గ‌త 17 సీజ‌న్లుగా ఐపీఎల్ టైటిల్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు అంద‌ని ద్రాక్ష‌గానే ఉంది. మరి పాటిదార్ కెప్టెన్సీలోనైనా ఆర్‌సీబీ ఐపీఎల్ క‌ప్పును ముద్దాడుతుందో లేదో చూడాలి మ‌రి.

మూడు సార్లు ఫైన‌ల్‌కు చేరినా..

ఐపీఎల్ 17 సీజ‌న్ల‌లో బెంగ‌ళూరు జ‌ట్టు మూడు సార్లు ఫైన‌ల్‌కు చేరుకుంది. 2009, 2011, 2016లో ఫైన‌ల్‌కు చేరుకున్నా అదృష్టం కలిసారాలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా ఐపీఎల్ విజేత‌గా నిల‌వాల‌ని ఆర్‌సీబీ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది. చాన్నాళ్లుగా బ్యాటింగ్ విభాగంలో ప‌టిష్టంగా ఉన్న‌ప్ప‌టికి బౌలింగ్ విభాగం బ‌ల‌హీనంగా ఉంద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఐపీఎల్ 2025 మెగా వేలంలో త‌న బ‌ల‌హీన‌త‌ల‌పై దృష్టి పెట్టి అత్యుత్త‌మ పేసర్ల‌ను తీసుకుంది. మొత్తంగా జ‌ట్టుగా స‌మ‌తూకంగా ఉన్న‌ట్లు క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.