RCBvKXIP: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు

తొలి విజయం నమోదు చేయాలని ఆరాటంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో పోరాడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. భారీ పట్టుదలతో కనిపిస్తోన్న బెంగళూరు గేమ్ గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చింది.
టాస్ అనంతరం బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. లీగ్ పట్టికలో మేం ఆఖరి స్థానంలో కొనసాగుతున్నాం. ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి. మాకు వేరే చాయీస్ లేదు. ప్రతి సీజన్ మనకు అనుకూల ఫలితాలను ఇస్తుందని లేదు కదా. ఏ భయం లేకుండా పోరాడాలని అనుకుంటున్నాం. ఇంకా ఆడే 8 మ్యాచ్‌లలోనూ ఆటను ఎంజాయ్ చేసేలా ఆడాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్‌కు ముగ్గురు విదేశీ ప్లేయర్లతో బరిలోకి దిగుతున్నాం. ఉమేశ్ యాదవ్ కు బదులుగా టిమ్ సౌథీ ఆడనున్నాడు.
పంజాబ్ కెప్టెన్ అశ్విన్ మాట్లాడుతూ.. ఈ ఏడు గేమ్స్‌లో మంచి ఆటనే కనబరిచామని భావిస్తున్నాం. ఐపీఎల్ అంటే గెలుపోటములు సహజం. విల్జియోన్ ఫ్లూ జ్వరంతో ఆటకు దూరమైయ్యాడు. టైను జట్టులోకి తీసుకున్నాం. మయాంక్.. ఎమ్ అశ్విన్ లు జట్టులోకి రాగా రాజ్‌పుత్ స్థానం కోల్పోయాడు.