RCBvsMI:బెంగళూరు టార్గెట్ 188

RCBvsMI:బెంగళూరు టార్గెట్ 188

Updated On : March 28, 2019 / 4:02 PM IST

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతోన్న RCBvsMI మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ పరవాలేదనిపించే స్కోరుతో బ్యాటింగ్ ముగించారు. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 188 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు.

ఓపెనర్లు క్వింటన్ డికాక్(23: 20 బంతుల్లో), రోహిత్ శర్మ(48; 33 బంతుల్లో) దూకుడుతో ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తే ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్(38; 24 బంతుల్లో), యువరాజ్ సింగ్(23; 12 బంతుల్లో) పరవాలేదనిపించారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన కీరన్ పొలార్డ్(5), కృనాల్ పాండ్యా(1), మిచెల్ మెక్‌నగన్(1), మయాంక్ మార్కండే(6), హార్దిక్ పాండ్యా(32), బుమ్రా(1)కు మాత్రమే పరిమితమైయ్యారు. 

చాహల్(4)వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ యాదవ్(2), మొహమ్మద్ సిరాజ్(2) వికెట్లు తీయగలిగారు.