RCBvsMI: బెంగళూరు కథ ముగిసినట్లే

ఐపీఎల్ 12వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ కు వెళ్లడం దాదాపు అసాధ్యం. వాంఖడే వేదికగా సోమవారం జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి ముంబైకు 172 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.
చేధనలో ముంబైని కట్టడి చేయలేకపోయింది. ఫీల్డింగ్ వైఫల్యం మరోసారి బయటపడటంతో జట్టు కోలుకోకుండా చేసింది ముంబై ఇండియన్స్. ఓపెనర్లు విజృంభించడంతో బెంగళూరుకు మ్యాచ్ చేజారిపోయింది. డికాక్ (40), రోహిత్ శర్మ(28), సూర్య కుమార్ యాదవ్(29), ఇషాన్ కిషన్(21), కృనాల్ పాండ్యా(11), హార్దిక్ పాండ్యా(37), కీరన్ పొలార్డ్(0)పరుగులు చేయగలిగారు..
బెంగళూరు బౌలర్లు సిరాజ్(1), చాహల్(2), మొయిన్ అలీ(2)వికెట్లు తీయగలిగారు.