Ricky Ponting: టీమిండియానే ఫేవరేట్‌ అంటూ.. రికీ పాంటింగ్‌ కామెంట్స్‌

శ్రేయాస్‌ అయ్యర్, అక్షర్‌ పటేల్ టీమండియా విజయాల్లో ముఖ్య పాత్ర పోషించారని అన్నారు.

Ricky Ponting: టీమిండియానే ఫేవరేట్‌ అంటూ.. రికీ పాంటింగ్‌ కామెంట్స్‌

Ricky Ponting

Updated On : March 4, 2025 / 1:32 PM IST

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భాగంగా ఆసీస్‌తో సెమీఫైనల్‌లో టీమిండియా తలపడుతున్న వేళ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాటింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సొంత ఆసీస్‌ జట్టును కాకుండా టీమిండియాను ఫేవరెట్‌గా ఆయన పేర్కొన్నారు.

అయితే, ఇటువంటి ముఖ్యమైన మ్యాచుల్లో ఆస్ట్రేలియా జట్టును తక్కువ అంచనా వేయలేమని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు టీమిండియా దుబాబ్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే.

దీంతో ఇతర జట్లలాగా పాకిస్థాన్‌ నుంచి దుబాయ్‌కు ప్రయాణించే అవసరం టీమిండియాకు లేదు. ఈ విషయాన్ని రికీ పాటింగ్‌ చెప్పారు. ”టీమిండియానే ఫేవరెట్‌. ఆ జట్టుకు ప్రయాణించే అవసరం లేకుండాపోయింది. అక్కడే సాధన చేశారు. ఆస్ట్రేలియా మాత్రం మ్యాచ్‌కు సిద్ధం కావడానికి పాక్‌ నుంచి దుబాబ్‌కు వెళ్లాల్సి వచ్చింది” అని తెలిపారు.

Also Read: మాజీ క్రికెటర్ పద్మకర్ శివాల్కర్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

రికీ పాటింగ్‌ 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ను కూడా గుర్తు చేశారు. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిందని, అయితే, అదే రోజు ఆ విషయాన్ని అక్కడి డ్రెసింగ్స్‌ రూమ్‌లోనే భారత్‌ వదిలేసి ఉండొచ్చని పాంటింగ్‌ అన్నారు.

టీమిండిమా మంచి అనుభవం సంపాదించిందని, కోచ్‌ కూడా మారారని, దీంతో టీమిండి ఆ ఓటమి గురించి పట్టించుకోవడం లేదని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. ఒకవేళ దాని గురించి భారత్ ప్లేయర్లు మాట్లాడుకున్న వారిలో అది విజయం సాధించాలని కోరికను మరింత ఎక్కువ చేస్తుందని అన్నారు. పరిస్థితులకు తగ్గట్లు ఆడడాన్ని టీమిండియా నేర్చుకుందని చెప్పారు.

శ్రేయాస్‌ అయ్యర్, అక్షర్‌ పటేల్ టీమండియా విజయాల్లో ముఖ్య పాత్ర పోషించారని అన్నారు. ఇప్పుడు వాతావరణ పరిస్థితులు కూడా భారత్‌కు కలిసి వస్తున్నాయని చెప్పారు. భారత్‌ ఫేవరెట్‌గా ఉన్నప్పటికీ తాను ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేయబోనని అన్నారు.