Padmakar Shivalkar: మాజీ క్రికెటర్ పద్మకర్ శివాల్కర్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
శివాల్కర్ క్రికెటర్ ఫస్ట్ క్లాస్ కెరీర్ 1961లో ప్రారంభమైంది.

భారత మాజీ క్రికెటర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ పద్మకర్ శివాల్కర్ (84) కన్నుమూశారు. ఆయనకు దేశవాళీ క్రికెట్‌లో మంచి రికార్డులు ఉన్నాయి. అయితే, ఆయనను దురదృష్టం వెంటాడింది. టీమిండియా తరఫున ఆయన ఆడలేకపోయారు. ఆయన గతంలో ఇరవై ఏళ్లకు పైగా ముంబై జట్టుకి ప్రాతినిధ్యం వహించారు.
బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ స్పందిస్తూ.. “భారత క్రికెట్ ఈ రోజు నిజమైన లెజెండ్‌ను కోల్పోయింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌పై పద్మకర్ శివాల్కర్‌కు ఉన్న నైపుణ్యం అద్భుతం. ఆటపై ఆయనకు ఉన్ లోతైన అవగాహన అతన్ని దేశీయ క్రికెట్‌లో గొప్ప వ్యక్తిగా మార్చింది” అని అన్నారు.
Also Read: మిషన్ అరుస్తుందిక్కడ.. రోడ్డుపై చెత్త వేశారనుకో.. మీ పని గోవిందా..
శివాల్కర్ మృతి పట్ల సునీల్ గవాస్కర్ సహా పలువురు మాజీ క్రికెటర్లు సంతాపం తెలిపారు. ముంబైకి ఎన్నో విజయాలు అందించిన మిలింద్‌తో పాటు పద్మాకర్ వంటి వారు కొంత కాలం వ్యవధిలో మనకు దూరం కావడం బాధాకరమని చెప్పారు.
శివాల్కర్ క్రికెటర్ ఫస్ట్ క్లాస్ కెరీర్ 1961లో ప్రారంభమైంది. ఆయన 1988 సీజన్ వరకు ముంబై తరఫున ఆడారు. 124 మ్యాచ్‌లలో 589 వికెట్లు తీశారు. 5 వికెట్ల ఘనతకు 42 సార్లు దక్కించుకున్నారు. అలాగే, 13 సార్లు 10 వికెట్లు పడగొట్టారు. 1972/73 సీజర్ రంజీలో ఫైనల్‌లో కేవలం 16 రన్స్ మాత్రమే ఇచ్చి 8 వికెట్లు తీయడం గమనార్హం. 2016లో ఆయన సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.