Rohit Sharma : వావ్.. అద్భుతం.. రోహిత్ శర్మ ‘ఐసీసీ’ రియల్ హీరో.. హిట్ మ్యాన్ రికార్డులు చూస్తే మీరు ఇదే అంటారు!

Rohit Sharma : రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో టీమ్ ఇండియా తరపున రెండేళ్లలో వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లను అందించాడు. అంతర్జాతీయ టీ20, వన్డే ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా ఒకే ఒక మ్యాచ్‌లో ఓడింది.

Rohit Sharma : వావ్.. అద్భుతం.. రోహిత్ శర్మ ‘ఐసీసీ’ రియల్ హీరో.. హిట్ మ్యాన్ రికార్డులు చూస్తే మీరు ఇదే అంటారు!

Rohit Sharma

Updated On : March 10, 2025 / 12:04 AM IST

Rohit Sharma : టీమిండియా ముచ్చటగా మూడోసారి ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. రోహిత్ శర్మ ఐసీసీ టోర్నమెంట్‌లో రియల్ హీరో.

గత మూడు ఐసీసీ టోర్నమెంట్లలో ఒకే ఒక్క మ్యాచ్‌లో భారత్ ఓడింది. రోహిత్ శర్మ అద్భుతంగా కెప్టెన్సీకి నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు. కేవలం ఒక మ్యాచ్‌లో ఓడినా భారత్ ఆ తర్వాత రెండు టోర్నమెంట్లలో వరుస విజయాలతో ఒత్తిడిని అధిగమించింది.

Read Also : Champions Trophy : మొన్న బాడీ షేమింగ్.. ఇప్పుడు హ్యాట్సాఫ్ అంటూ రోహిత్‌పై ప్రశంసలు.. కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ కామెంట్స్ వైరల్!

ఐసీసీ పరిమిత ఓవర్ల టోర్నమెంట్‌లో భారత్ 23 మ్యాచ్‌ల్లో 22 గెలిచింది. వన్డే, టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌‌ల్లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత భారత్ ఐసీసీ టోర్నమెంట్లలో మొత్తం 23 మ్యాచ్‌లు ఆడింది. అందులో భారత్ 22 గెలిచింది. ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయింది.

2023 వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు ఫైనల్ వరకు వరుసగా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఫైనల్స్ వచ్చేసరికి 11వ మ్యాచ్‌లో ఓడిపోయింది. వాస్తవానికి ఇది అత్యంత కీలకమైన మ్యాచ్. ఆ తర్వాత, 2024 టీ20 ప్రపంచ కప్ సమయంలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరుకుంది. ఆ తరువాత రోహిత్ శర్మ మరో టైటిల్ అందించాడు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ విజయం సాధించింది.

ఈసారి అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలుపు :
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయాలతోనే టోర్నీని ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన తర్వాత భారత్ పాకిస్థాన్‌ను ఓడించింది. ఆ తర్వాత, న్యూజిలాండ్ చివరి లీగ్ మ్యాచ్‌లో కూడా ఓడిపోయింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి భారత్ ఫైనల్స్‌కు చేరడంతో అసలు ఆట మొదలైంది.

Read Also : Champions Trophy : హిట్ మ్యాన్ అదరగొట్టాడు.. వరుసగా రెండోసారి.. ధోని తర్వాత రోహిత్ శర్మనే.. కపిల్, గంగూలీ రికార్డులను బ్రేక్ చేశాడు..!

ఫైనల్లో భారత్‌కు ముప్పుగా ఉన్న న్యూజిలాండ్‌తోనే బరిలోకి దిగింది. కానీ, ఈసారి రోహిత్ శర్మ అద్భుతమైన ప్రదర్శనతో భారత్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా ఐసీసీ టైటిల్ సాధించిపెట్టాడు.

ఇప్పటివరకు భారత్ మూడుసార్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. వరుసగా రెండేళ్లలో భారత్ రెండు ఐసీసీ టైటిళ్లను గెలుచుకోవడం ఇదే తొలిసారి. 2024లో టీ 20 ప్రపంచ కప్ తర్వాత ఇప్పుడు 2025లో ఛాంపియన్స్ ట్రోఫీని రోహిత్ శర్మ గెలుచుకున్నాడు.