Rohit Sharma : స్కూల్ బుక్‌లో రోహిత్ శర్మ పై పాఠ్యాంశం..!
A chapter on Rohit Sharma : స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో టీమ్ఇండియా అదరగొడుతోంది. వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకువెళ్లింది.

Rohit Sharma
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో టీమ్ఇండియా అదరగొడుతోంది. వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఆదివారం (నవంబర్ 19న) ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఆడనుంది. భారత విజయాలలో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రోహిత్ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా.. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు జనరల్ నాలెడ్జ్ స్కూల్ పుస్తకంలోని ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పుస్తకంలో ఓ అధ్యాయం పూర్తిగా భారత కెప్టెన్ రోహిత్ శర్మకు అంకితం చేయబడింది.
ప్రతిభావంతుడైన యువ బ్యాటర్ పేరున ఈ ఛాప్టర్ ఉంది. ఇందులో రోహిత్ శర్మ గురించి ప్రస్తావించారు. రోహిత్ శర్మ ఎప్పుడు పుట్టారు. తన కెరీర్‌ను ఆఫ్ స్పిన్‌తో మొదలుపెట్టిన శర్మ ఎలా బ్యాటర్‌గా మారాడు వంటి విషయాలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం, వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు అయిన 264 ఇన్నింగ్స్ గురించి వివరాలు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన రోహిత్ శర్మ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
David Miller : చరిత్ర సృష్టించిన డేవిడ్ మిల్లర్.. ఒకే ఒక్కడు
A chapter on Rohit Sharma in a school book. pic.twitter.com/X3KDtniNKl
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 17, 2023
ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్..
ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుతో టీమ్ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి 12 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. అదే సమయంలో 2003లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆశిస్తున్నారు. అటు ఆస్ట్రేలియా సైతం మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని పట్టుదలగా ఉంది.
సెమీస్‌లో మెరుపు ఆరంభాన్ని ఇచ్చిన రోహిత్..
న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. 29 బంతులు ఎదుర్నొన్న రోహిత్ శర్మ 47 పరుగులు చేసి కివీస్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. రోహిత్ ఇచ్చిన ఆరంభానికి, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లు శతకాలు తోడు కావడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. అనంతరం భారత పేసర్ మహ్మద్ షమీ 7 వికెట్లతో విజృంభించడంతో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 70 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకువెళ్లింది.
PM Narendra Modi : ప్రపంచకప్ ఫైనల్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..!
ప్రపంచకప్‌లలో రెండు సార్లు 500 పరుగులు
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను అందుకున్నాడు. రెండు ప్రపంచకప్ టోర్నీలలో 500 కంటే ఎక్కవ పరుగులు చేసిన రెండవ భారత బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో 648 పరుగులు చేసిన రోహిత్ తాజా ప్రపంచకప్ 2023లో 550 పరుగులు చేశాడు.