IND Vs WI: ఇషాంత్ కిషన్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో ఇదిగో

డిక్లేర్ ప్రకటించడానికి ముందు ఇషాంత్ కిషన్ క్రీజులో ఉన్నాడు.

IND Vs WI: ఇషాంత్ కిషన్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో ఇదిగో

Rohit Sharma

Updated On : July 15, 2023 / 10:06 AM IST

WI vs IND 1ST Test : ఇషాంత్ కిషన్ ( Ishan Kishan ) పై కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచులో టీమిండియా 421/5 పరుగులకు డిక్లేర్ ఇచ్చిన విషయం తెలిసిందే.

డిక్లేర్ ప్రకటించడానికి ముందు ఇషాంత్ కిషన్ క్రీజులో ఉన్నాడు. 20 బంతులు ఆడి కేవలం ఒకే ఒక్క పరుగు చేశాడు. దీంతో రోహిత్ శర్మకు కోపం వచ్చేసింది. డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఇషాన్ కిషన్ వైపుగా చూస్తూ డిక్లేర్ ఇచ్చాడు. దూకుడుగా ఆడాల్సిన సమయంలో ఇషాంత్ కిషన్ ఒకే ఒక్క పరుగు చేయడానికి 20 బంతులు తీసుకోవడం సరికాదని నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, తొలి టెస్టులో వెస్టిండీస్‌ను భారత్ ఇన్నింగ్స్, 141 పరుగులతో ఓడించింది. రెండో టెస్టు మ్యాచు జులై 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ చివరి టెస్టులో భారత్ గెలిచినా, డ్రా అయినా టెస్టు సిరీస్ ను టీమిండియానే కైవసం చేసుకుంటుంది.

IND Vs WI: వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భారత్… తొలి మ్యాచులో 171 రన్స్ చేసిన జైస్వాల్‌పై రోహిత్ ప్రశంసల జల్లు