IPL 2020, RCB vs RR: రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం

RCB vs RR IPL 2020: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి), రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) మధ్య అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతున్న ఐపిఎల్ 2020 15వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ రాజస్థాన్ రాయల్స్‌పై 8వికెట్ల తేడాతో విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్.. కోహ్లీ, పాడికల్ రాణించడంతో 8వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచిన తరువాత, మొదట బ్యాటింగ్ చేయడానికి వచ్చిన రాజస్థాన్ ఆరు వికెట్లకు 154 పరుగులు చేసింది. మహిల్‌పాల్ లోమోర్ జట్టుకు 47 పరుగులు చేశాడు. 39 బంతుల్లో నాలుగు, మూడు సిక్సర్లు కొట్టాడు. జోస్ బట్లర్ 22, రాబిన్ ఉత్తప్ప 17 పరుగులు అందించగా.. చివర్లో రాహుల్ తెవాటియా 12 బంతుల్లో అజేయంగా 24 పరుగులు చేయడంతో రాజస్థాన్ 154పరుగులు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున యుజ్వేంద్ర చాహల్ మూడు, ఇసురు ఉడనా రెండు వికెట్లు తీశారు. నవదీప్ సైనీకి ఒక వికెట్ లభించింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL 2020 సీజన్‌లో మొట్టమొదటి సారి అన్ని విభాగాల్లో రాణించి అద్భుత విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు… టార్గెట్‌ని అలవోకగా చేధించింది. ఆరోన్ ఫించ్ 8 పరుగులకే అవుట్ అయినా.. దేవ్‌దత్ పాడికల్‌తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ టార్గెట్‌ని ఈజీ చేశాడు. దేవ్‌దత్ పడిక్కల్ సీజన్‌లో మూడో హాఫ్ సెంచరీ చేసి అరుదైన రికార్డు క్రియేట్ చేయగా… వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చిన విరాట్ కోహ్లీ సీజన్‌లో మొదటి అర్ధశతకం బాదాడు.
రెండో వికెట్‌కి 80 బంతుల్లో 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 45 బంతుల్లో 63 పరుగులు చేసిన దేవ్‌దత్ పాడికల్ అవుట్ అయ్యాడు. పాడికల్ అవుటైన తర్వాత దూకుడు కొనసాగించిన కోహ్లీ 53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేయగా 8 వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై విజయం సాధించింది బెంగళూరు జట్టు.