RRvsMI: కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్, టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్

RRvsMI: కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్, టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్

Updated On : April 20, 2019 / 10:10 AM IST

రాజస్థాన్ వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో కీలక మార్పులు చేసుకుని రాజస్థాన్ రాయల్స్.. ముంబై ఇండియన్స్ తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిట్సల్స్ విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ లోనూ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. 
Also Read : BCCI విలక్షణ తీర్పు : పాండ్యా..రాహుల్‌కు రూ. 20 లక్షల ఫైన్

ఆరిదీపానికి వెలుగెక్కువ అని దాదాపు అవకాశాలు చేజారిపోయాయని అనుకుంటున్న తరుణంలో స్టీవ్ స్మిత్‌కు పగ్గాలు అందించి కొత్త ఉత్సాహం అందించే ప్రయత్నం చేసింది. ఐపీఎల్ సీజన్ 12 ఆరంభం నుంచి ఆడిన 8మ్యాచ్ ల్లో గెలిచింది కేవలం 2 మాత్రమే. 

ముంబై ఇండియన్స్:
డికాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, బెన్ కట్టింగ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, మయాంక్ మార్కండే, రాహుల్ చాహర్, లసిత్ మలింగ, బుమ్రా

రాజస్థాన్ రాయల్స్:
సంజూ శాంసన్, అజింకా రహానె, స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, ఆష్టన్ టర్నర్, స్టువర్ట్ బిన్నీ, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, జయదేశ్ ఉన్‌దక్త్, ధావల్ కుల్‌కర్ణి