RRvsRCB: రాజస్థాన్ గెలిచింది.. బెంగళూరుకు మరో పరాభవం

RRvsRCB: రాజస్థాన్ గెలిచింది.. బెంగళూరుకు మరో పరాభవం

Updated On : April 2, 2019 / 6:05 PM IST

ఐపిఎల్ లో భాగంగా రాజస్థాన్ లోని సవాయ్ మాన్ సింగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ .. బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో రాజస్థాన్ లీగ్ లో తొలి విజయం నమోదు చేసుకోగా బెంగళూరుకు వరుసగా నాలుగో సారి పరాభవానికి గురైంది.

కోహ్లీసేన నిర్దేశించిన 159 పరుగుల టార్గెట్‌ను ఒక బాల్ మిగిలి ఉండగానే రాజస్థాన్ చేధించింది. చేధనలో కెప్టెన్ రహానె(22)నిరాశపరిచినప్పటికీ, జోస్ బట్లర్(59), స్టీవ్ స్మిత్(38), రాహుల్ త్రిపాఠీ(34), బెన్ స్టోక్స్(1)బాదుడికి విజయం చేజిక్కింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్(1), చాహల్ రెండు వికెట్లు తీయగలిగారు. 

ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకన్న రాజస్థాన్.. బౌలర్లు విజృంభించారు. రహానె సేన ధాటికి బెంగళూరు 4వికెట్లు నష్టపోయి 158పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లీ(23), డివిలియర్స్(13)పరుగులు మాత్రమే చేయగలిగారు.

పార్థివ్ పటేల్ ఒక్కడే జట్టులో హాఫ్ సెంచరీకి మించిన స్కోరుతో మెప్పించాడు. (67 పరుగులు ; 41 బంతుల్లో 9ఫోర్లు, 1సిక్సు)తో జట్టుకు కీలకంగా మారాడు. హెట్ మేయర్(1), మార్కస్ స్టోనిస్(31), మొయిన్ అలీ(18)పరుగులతో సరిపెట్టుకున్నారు. 

శ్రేయాస్ గోపాల్ ఒక్కడే (3)వికెట్లు పడగొట్టగా జోఫ్రా ఆర్చర్(1)వికెట్ తీయగలిగాడు.