Memes on Ruturaj Gaikwad: నిన్న తొలి అంతర్జాతీయ వన్డే ఆడిన రుతురాజ్‌పై ట్రోలింగ్.. వీడియోలు వైరల్

భారత్-దక్షిణాఫ్రికా మధ్య నిన్న లక్నోలో తొలి వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ద్వారా రుతురాజ్ గైక్వాడ్ అంతర్జాతీయ వన్డేల్లోకి ఆరంగేట్రం చేశాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అద్భుతంగా ఆడి మంచి పేరు తెచ్చుకున్న రుతురాజ్ గైక్వాడ్ నిన్న జరిగిన అంతర్జాతీయ వన్డేలో మాత్రం క్రీజులో బంతులను మిస్ చేస్తూ, డిఫెన్స్ ఆడుతూ టీమిండియా అభిమానులకు అసహనం తెప్పించాడు. కనీసం అతడు త్వరగా ఔట్ అయితే వేరే బ్యాట్స్ మన్ అయినా వచ్చి క్రీజులో బాగా ఆడతాడని ప్రేక్షకులు భావించారు. అటు ఔట్ కాకుండా, ఇటు బౌండరీలు బాదకుండా క్రీజులో అతడు హంగామా చేశాడంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Memes on Ruturaj Gaikwad: నిన్న తొలి అంతర్జాతీయ వన్డే ఆడిన రుతురాజ్‌పై ట్రోలింగ్.. వీడియోలు వైరల్

Memes on Ruturaj Gaikwad

Updated On : October 7, 2022 / 4:28 PM IST

Memes on Ruturaj Gaikwad: తొలి అంతర్జాతీయ వన్డే ఆడిన రోజే టీమిండియా కొత్త కుర్రాడు రుతురాజ్ గైక్వాడ్ విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. భారత్-దక్షిణాఫ్రికా మధ్య నిన్న లక్నోలో తొలి వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ద్వారా రుతురాజ్ గైక్వాడ్ అంతర్జాతీయ వన్డేల్లోకి ఆరంగేట్రం చేశాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అద్భుతంగా ఆడి మంచి పేరు తెచ్చుకున్న రుతురాజ్ గైక్వాడ్ నిన్న జరిగిన అంతర్జాతీయ వన్డేలో మాత్రం క్రీజులో బంతులను మిస్ చేస్తూ, డిఫెన్స్ ఆడుతూ టీమిండియా అభిమానులకు అసహనం తెప్పించాడు.

కనీసం అతడు త్వరగా ఔట్ అయితే వేరే బ్యాట్స్ మన్ అయినా వచ్చి క్రీజులో బాగా ఆడతాడని ప్రేక్షకులు భావించారు. అటు ఔట్ కాకుండా, ఇటు బౌండరీలు బాదకుండా క్రీజులో అతడు హంగామా చేశాడంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్నటి మ్యాచులో 42 బంతులు ఆడిన రుతురాజ్ గైక్వాడ్ 19 పరుగులు మాత్రమే చేశాడు. అందులో కేవలం ఒక్క ఫోరు మాత్రమే ఉంది.

అనంతరం అతడిని శాంసీ ఔట్ చేశాడు. దీంతో రుతురాజ్ గైక్వాడ్ స్ట్రైక్-రేట్ గురించి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇతడిని ఓపెనర్ గా దించితే 50 ఓవర్ల వరకు ఔట్ కాకుండా, పరుగులు చేయకుండా క్రీజులో బంతులు వృథా చేస్తూ టీమిండియాకి గొప్ప విజయాన్ని అందిస్తాడంటూ కొందరు సెటైర్లు వేశారు. నిన్నటి మ్యాచులో రుతురాజ్ కు సంబంధించిన వీడియోలను, బంతులను అతడు వృథా చేసిన తీరును సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..