Sanjiv Goenka- KL Rahul : కేఎల్ రాహుల్‌కు ల‌క్నోయ‌జ‌మాని సంజీవ్ గోయెంకా శుభాకాంక్షలు.. నెట్టింట ట్రోలింగ్‌..

కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి సోమ‌వారం పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది.

Sanjiv Goenka- KL Rahul : కేఎల్ రాహుల్‌కు ల‌క్నోయ‌జ‌మాని సంజీవ్ గోయెంకా శుభాకాంక్షలు.. నెట్టింట ట్రోలింగ్‌..

Sanjiv Goenka congratulates KL Rahul on newborn gets brutally trolled by fans

Updated On : March 25, 2025 / 2:49 PM IST

టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ కేఎల్ రాహుల్ తండ్రి అయ్యాడు. ఆయ‌న భార్య, బాలీవుడ్ న‌టి అతియా శెట్టి సోమ‌వారం పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది. ఈ విష‌యాన్ని రాహుల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు. అభిమానుల‌తో త‌న ఆనందాన్ని పంచుకున్నాడు.

ఈ క్ర‌మంలో రాహుల్ కు ప‌లువురు సినీ, క్రీడా, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు ప‌లువురు నెటిజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ య‌జ‌మాని సంజీవ్ గొయెంకా సైతం రాహుల్‌కు అభినంద‌లు తెలిపారు.

DC vs LSG : ఢిల్లీ పై ఓట‌మి.. ల‌క్నో డ్రెస్సింగ్ రూమ్‌లో ఆట‌గాళ్ల‌కు సంజీవ్ గొయెంకా క్లాస్.. వీడియో వైర‌ల్‌

‘అద్భుత‌మైన వార్త విన్నందుకు ఆనందంగా ఉంది. రాహుల్‌, అతియా మీకు కూతురు పుట్టినందుకు అభినంద‌లు. మీ కుటుంబానికి ప్రేమ‌, ఆనందంతో పాటు ఎన్నో వెల‌క‌ట్ట‌లేని మ‌ధుర‌మైన క్ష‌ణాలను ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను.’ అని సంజీవ్ గొయెంకా సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చాడు.

అయితే.. గొయెంకా ను నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్ 2024లో కేఎల్ రాహుల్‌తో వ్య‌వ‌హ‌రించిన తీరును మ‌రోసారి గుర్తు చేస్తూ.. విన‌య‌పూర్వ‌క‌మైన వ్య‌క్తిని ఇంకెప్పుడూ అగౌర‌వ‌ప‌ర‌చ‌వ‌ద్ద‌ని అభిమానులు గొయెంకాకు సూచిస్తున్నారు.

గ‌తేడాది ఐపీఎల్‌లో ఏం జ‌రిగింది?

ఐపీఎల్ 2024సీజ‌న్‌లో భాగంగా ఓ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. అప్పుడు ల‌క్నో కెప్టెన్‌గా రాహుల్ ఉన్నాడు. అయితే.. ఆ మ్యాచ్‌లో ల‌క్నో జ‌ట్టు ఘోరంగా ఓడిపోయింది. 10 వికెట్ల తేడాతో స‌న్‌రైజ‌ర్స్ గెలిచింది.

SRH vs LSG : స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అభిమానుల‌కు డ‌బుల్ బొనాంజా.. ల‌క్నోతో మ్యాచ్ కు ఉప్ప‌ల్‌లో థ‌మ‌న్ స్పెష‌ల్ ఫెర్ఫామెన్స్‌..

దీంతో మ్యాచ్ అనంత‌రం మైదానంలో కేఎల్ రాహుల్ పై సంజీవ్ గొయెంకా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న‌ట్లుగా ఉన్న ఫోటోలు, వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో గొయెంకా పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఏదైన ఉంటే.. రూమ్‌లో చెప్పాలి గానీ.. స్టార్ క్రికెట‌ర్ ప‌ట్ల మైదానంలో ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌న్నారు. ఆట‌లో గెలుపోట‌లు ఎంతో స‌హ‌జం అని అన్నారు.

ఆ త‌రువాత కేఎల్ రాహుల్‌ను గోయెంకా త‌న ఇంటికి విందుకు ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. ఇక‌ కేఎల్ రాహుల్ ల‌క్నోను వీడాడు. మెగావేలం2025 లో పాల్గొన్నాడు. మెగావేలం2025 లో అత‌డిని ఢిల్లీ క్యాపిట‌ల్స్ సొంతం చేసుకుంది. మ‌రోవైపు రిష‌బ్ పంత్‌ను ల‌క్నో భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.

DC vs LSG : ఈజీగా గెలిచే మ్యాచ్‌లో ఓడిపోవ‌డం పై స్పందించిన రిష‌బ్ పంత్..

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ల‌క్నో జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. సోమ‌వారం రాత్రి విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్ వికెట్ తేడాతో ఓట‌మిని చ‌విచూసింది.