వరల్డ్ కప్ కంటే సన్‌రైజర్స్ హైదరాబాదే ముఖ్యం

ఐపీఎల్ అంటే పడిచచ్చే అభిమానులే కాదు.. జాతీయ జట్టుతో పాటుగా ప్రాధాన్యమిచ్చే ప్లేయర్లు ఉన్నారనిపించాడు ఆ క్రికెటర్. వరల్డ్ కప్ టోర్నీ కోసం క్యాంప్‌తో హాజరుకావాలని షకీబ్ అల్ హసన్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పిలుపునిచ్చింది.
వరల్డ్ కప్‌కు ముందు ఐర్లాండ్‌తో పాటు ట్రై నేషన్ సిరీస్‌లో బంగ్లాదేశ్ ఆడాల్సి ఉంది. వరల్డ్ కప్ టోర్నీ ప్రాక్టీస్‌కు వెళ్లాల్సి ఉండడంతో వార్నర్, బెయిర్ స్టో లాంటి ప్లేయర్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దూరం కానున్నారు. ఇలా చాలా ఖాళీ స్థానాల్లో ఆడే అవకాశం వస్తుందని భావించిన బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్.. తనకు ఐపీఎలే ముఖ్యమని రావడం కుదరదని తెగేసి చెప్పాడు.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘లీగ్ మ్యాచ్‌ల్లో ఆడేందుకు అవకాశాలు రావడం లేదు కదా. ఏప్రిల్ 23కల్లా తిరిగొచ్చేయమని చెప్పాం. కానీ, సన్‌రైజర్స్ ఖాళీ స్థానంలో ఆడేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయని రావాలనుకోవడం లేదని తెలిపాడు. ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లు ఆడకుండా ఐపీఎల్ ఆడుకోవడానికి అతనికి పర్మిషన్ ఇచ్చాం’ అని వెల్లడించాడు.