Shubman Gill: శ‌త‌క్కొట్టిన గిల్‌.. ఈ సీజ‌న్‌లో మూడోది.. ఒక సీజ‌న్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్లు వీరే

ఐపీఎల్(IPL) 2023 సీజ‌న్‌లో గుజ‌రాత్ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్(Shubman Gill) అద‌ర‌గొడుతున్నాడు. శుక్ర‌వారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా న‌రేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియ‌న్స్‌(Mumbai Indians)తో జ‌రిగిన మ్యాచ్‌లో శ‌త‌క్కొట్టాడు.

Shubman Gill: శ‌త‌క్కొట్టిన గిల్‌.. ఈ సీజ‌న్‌లో మూడోది.. ఒక సీజ‌న్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్లు వీరే

Shubman Gill Scores Third IPL Century Of Season

Updated On : May 26, 2023 / 10:26 PM IST

Shubman Gill Century: ఐపీఎల్(IPL) 2023 సీజ‌న్‌లో గుజ‌రాత్ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్(Shubman Gill) అద‌ర‌గొడుతున్నాడు. శుక్ర‌వారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా న‌రేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియ‌న్స్‌(Mumbai Indians)తో జ‌రిగిన మ్యాచ్‌లో శ‌త‌క్కొట్టాడు. 49 బంతుల్లో సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 60 బంతులు ఆడిన గిల్ 7 ఫోర్లు, 10 సిక్స‌ర్ల‌తో 129 ప‌రుగులు చేశాడు. ఈ సీజ‌న్‌లో గిల్‌కు ఇది మూడో శ‌త‌కం కాగా.. చివరిగా ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడో సెంచరీ కావడం గమనార్హం.

యంగ్ ప్లేయ‌ర్‌గా రికార్డు

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ చ‌రిత్ర‌లో ఒక సీజ‌న్‌లో మూడు సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో గిల్ చోటు ద‌క్కించుకున్నాడు. ఈ ఘ‌న‌త సాధించిన రెండో భార‌త ఆట‌గాడు కాగా.. తొలి యంగెస్ట్ ప్లేయ‌ర్‌గా గిల్ రికార్డుల‌కు ఎక్కాడు. ఒక‌ సీజ‌న్‌లో అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన ఆట‌గాళ్లుగా విరాట్ కోహ్లి(2016), జోస్ బ‌ట్ల‌ర్‌(2022) చెరో నాలుగు సెంచ‌రీలు చేసి సంయుక్తంగా మొద‌టి స్థానంలో ఉండ‌గా వీరి త‌రువాత గిల్ మూడు శ‌త‌కాల‌తో ఉన్నాడు.

Shubman Gill: శుభ్‌మ‌న్ గిల్ కు చాన్స్ ఉంది.. ప్లేఆఫ్ లో ఎలా ఆడతాడో..!

ఈ సీజ‌న్‌లో సెంచ‌రీ చేసిన ఆట‌గాళ్లు వీరే

తాజాగా గిల్ చేసిన సెంచ‌రీతో క‌లిపి సీజ‌న్‌లో మొత్తంగా 12 సెంచ‌రీలు న‌మోదు అయ్యాయి. గిల్ మూడు శ‌త‌కాలు చేయ‌గా, కోహ్లి రెండు సెంచ‌రీలు చేశాడు. మిగిలిన వారిలో హెన్రిచ్ క్లాసెన్‌, హ్యారీ బ్రూక్, య‌శ‌స్వి జైశ్వాల్‌, వెంక‌టేశ్ అయ్య‌ర్‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, ప్రభసిమ్రాన్ సింగ్, కామెరూన్ గ్రీన్‌లు ఒక్కొ సెంచ‌రీ చేశారు.

ఐపీఎల్‌లో అత్య‌ధిక శ‌త‌కాలు చేసిన ఆట‌గాళ్ల జాబితా

విరాట్ కోహ్లి – 7
క్రిస్ గేల్‌- 6
జోస్ బ‌ట్ల‌ర్ -5
కేఎల్ రాహుల్ – 4
డేవిడ్ వార్న‌ర్ – 4
షేన్ వాట్స‌న్ -4

Shubman Gill: ఆర్‌సీబీ ఓట‌మికి ఆమెకు ఏమి సంబంధం..? గిల్ సోద‌రిని తిట్టిపోస్తున్న ఫ్యాన్స్‌..!