Rohit Sharma Retirement: టెస్టు క్రికెట్ కు రోహిత్ శర్మ గుడ్ బై.. సౌరభ్ గంగూలీ కీలక కామెంట్స్
రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ మాట్లాడుతూ..

Sourav Ganguly
Rohit Sharma Retirement: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. టెస్టులకు గుడ్ బై చెప్పాలన్న రోహిత్ నిర్ణయం అభిమానులకు కచ్చితంగా షాకింగ్ న్యూసే. వచ్చే నెలలో ఇంగ్లాండ్ లో జరిగే ప్రతిష్టాత్మక ఐదు టెస్టుల సిరీస్ లో అతనే జట్టును నడిపిస్తాడని అంతా భావించారు. కొన్నిరోజుల ముందే ఈ పర్యటనకోసం బీసీసీఐ సన్నాహాలు మొదలు పెట్టింది. సెలెక్టర్ల లిస్ట్ లో రోహిత్ శర్మ పేరుకూడా ఉంది. దీంతో అతనే కెప్టెన్ అని కూడా వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో టెస్టు క్రికెట్ కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ వర్గాలను షాకింగ్ కు గురిచేసింది.
రోహిత్ శర్మకు ప్రస్తుతం 38ఏళ్లు. 2013లో వెస్టిండీస్ పై టెస్టు క్రికెట్ ఫార్మాట్ లో అరంగేట్రం చేశాడు. 12ఏళ్ల కెరీర్ లో 67 టెస్టులు ఆడిన రోహిత్ శర్మ.. 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించాడు. అందులో 12 శతకాలు, 18 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 2019లో దక్షిణాఫ్రికా జట్టుపై 212 పరుగులు చేశాడు.
రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ స్పందించారు. ‘‘రోహిత్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. అతను గొప్ప ఆటగాడు. కానీ, ప్రతి ఆటగాడూ ఏదో ఒక దశలో ఆటను వీడాలి. రోహిత్ శర్మ టెస్టు కెరీర్ గొప్పగా సాగింది. ఇకపై వన్డేల్లో, ఐపీఎల్ లో కొనసాగుతాడు. నేను బీసీసీఐలో భాగమైనప్పుడు రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ కాగలడని భావించా. అతను అదే అయ్యాడు. కెప్టెన్ గా టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ సాధించాడు. టెస్టుల్లోనూ జట్టుకు అనేక విజయాలు అందించాడు.’’ అని గంగూలీ పేర్కొన్నాడు.
#WATCH | Kolkata | On Team India skipper Rohit Sharma announces retirement from Test Cricket, Former Indian cricket team captain Sourav Ganguly says, “He is a great player for India, but someone has to leave the game. My best wishes to him. He had a good career, he will play One… pic.twitter.com/LgnFUAS5PF
— ANI (@ANI) May 7, 2025