IPL 2025: ‘నా వయస్సు 42ఏళ్లు’.. ఐపీఎల్ రిటైర్మెంట్ పై ఎంఎస్ ధోనీ కీలక కామెంట్స్.. ఎప్పుడు రిటైర్ అవుతారంటే.?
కేకేఆర్ పై విజయంతో సూపర్ కింగ్స్ జట్టు నాలుగు మ్యాచ్ ల పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది.

MS Dhoni
IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో సీఎస్కే జట్టు రెండు వికెట్ల తేడాతో కేకేఆర్ జట్టుపై విజయం సాధించింది. తొలుత కోల్ కతా బ్యాటింగ్ చేయగా.. ఆరు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన సీఎస్కే జట్టు 19.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసి విజేతగా నిలిచింది.
Also Read: IPL 2025: కోల్‌కతా ఆశలపై నీళ్లు చల్లిన చెన్నై..! తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమి..
కేకేఆర్ పై విజయంతో సూపర్ కింగ్స్ జట్టు నాలుగు మ్యాచ్ ల పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ తన ఐపీఎల్ రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కెరీర్ చివరి దశలో ఉన్నాని అంగీకరించాడు. అయితే, వెంటనే రిటైర్మెంట్ ప్రకటించే ఉద్దేశం తనకు లేదని, సకాలంలో నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు.
మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ.. ‘‘ఇది నాకు ఎప్పుడూ లభించే ప్రేమ, ఆప్యాయత (మైదానంలో ప్రేక్షకుల మద్దతును ఉద్దేశిస్తూ). నా వయస్సు 42ఏళ్లు అని మర్చిపోవద్దు. నేను చాలాకాలంగా ఆడుతున్నాను. వారిలో చాలా మందికి నా చివరి మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు (నవ్వుతూ) కాబట్టి వారు వచ్చి నా ఆటను చూడాలనుకుంటున్నారు. వాస్తవాన్ని తప్పించుకునే అవకాశం లేదు. ఈ ఐపీఎల్ ముగిసిన తరువాత నేను మరో ఆరు నుంచి ఎనిమిది నెలల కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. నా శరీరం ఈ ఒత్తిడిని తట్టుకోగలదా..? లేదా.. అని చూడాలి. ప్రస్తుతానికి తన రిటైర్మెంట్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, ప్రేక్షకుల నుంచి నాకు లభిస్తున్న ప్రేమ, ఆప్యాయత అద్భుతమైనవి’’ అంటూ ధోనీ పేర్కొన్నారు.
MS Dhoni said, “I play for 2 months in a year, I need to work hard again for 6-8 months to see if I can play again. I’ve decided nothing so far”. pic.twitter.com/awkv7JvmYo
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 7, 2025