SRHvDC: ఢిల్లీ పతనం శాసించిన సన్ రైజర్స్

SRHvDC: ఢిల్లీ పతనం శాసించిన సన్ రైజర్స్

Updated On : April 4, 2019 / 5:56 PM IST

సన్ రైజర్స్ ధాటిని ఢిల్లీ తట్టుకోలేకపోయింది. గేమ్ అంతా హైదరాబాద్ చేతుల్లోనే ఉంచుకుంది. 130 పరుగుల లక్ష్య చేధనకు బరిలోకి దిగిన సన్ రైజర్స్ 18.3ఓవర్లకే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

గత మ్యాచ్‌లో వీర బాదుడుతో జట్టుకు విజయాన్నందించిన బెయిర్ స్టో ఈ మ్యాచ్‌లోనూ అదే స్థాయిలో రెచ్చిపోయాడు. 28 బంతుల్లో 48 పరుగులు చేసి శుభారంభాన్నిచ్చాడు. అయితే ఢిల్లీ బౌలర్ల ధాటికి మిగిలిన ప్లేయర్లు కొద్దిపాటి స్కోరుకే పరిమితమై వెనుదిరిగారు. 

డేవిడ్ వార్నర్ (10), విజయ్ శంకర్ (16), మనీశ్ పాండే(10), దీపక్ హుడా(10), యూసుఫ్ పఠాన్(9),నబీ (17)పరుగులు చేసి విజయం సాధించారు. 

అంతకుముందు టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ తో ఢిల్లీకి ముచ్చెమటలు పోయించింది. ఈ క్రమంలో 8 వికెట్లు నష్టపోయిన ఢిల్లీ.. హైదరాబాద్ కి 130 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ ఆరంభం నుంచి తడబడుతూనే బ్యాటింగ్ కొనసాగించింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(43; 41 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సు), పృథ్వీ షా(11), శిఖర్ ధావన్(12), రిషబ్ పంత్(5), తెవాటియా(5), ఇన్ గ్రామ్(5), క్రిస్ మోరిస్(17), అక్సర్(23), రబాడ(3), ఇషాంత్(0) పరుగులు చేయగలిగారు.

భువనేశ్వర్ కుమార్, నబీ, సిద్ధార్థ్ కౌల్ ఒక్కొక్కరు 3 వికెట్లు తీయగా రషీద్ ఖాన్, సందీప్ శర్మలు ఒక్కో వికెట్ తీయగలిగారు.