SRHvsKXIP: పంజాబ్ టార్గెట్ 151

మొహాలీ వేదికగా సన్ రైజర్ హైదరాబాద్ బ్యాట్స్ మెన్ ను పంజాబ్ బౌలర్లు వణికించారు. బౌలర్లకు బాగా అనుకూలించే పిచ్ కావడంతో బౌలింగ్ ప్రధాన బలంగా మ్యాచ్ ను దక్కించుకునే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రెచ్చిపోయింది. ఈ క్రమంలో తడబడుతూ బ్యాటింగ్ చేస్తూనే 4వికెట్లు నష్టపోయి 151 పరుగుల టార్గెట్ నిర్దేశించారు.
పంజాబ్ బౌలర్లు ఆరంభం నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నా.. హైదరాబాద్ శ్రమించి 150 పరుగుల స్కోరుతో చక్కటి స్కోరు చేయగలిగారు. ఇక చివరి ఓవర్లలో బ్యాటింగ్ లో ఉన్న దీపక్ హుడా 3 బంతుల్లో 14 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అతనితో పాటు డేవిడ్ వార్నర్(70; 6 ఫోర్లు, 1 సిక్సు)తో అదరగొట్టారు.
వీరితో పాటు జానీ బెయిర్ స్టో(1), విజయ్ శంకర్(26), నబీ(12), మనీశ్ పాండే(19), దీపక్ హుడా(14)పరుగులు చేయగలిగారు. పంజాబ్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహమాన్, షమీ, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీయగలిగారు.