SRHvsKXIP: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

పంజాబ్ లోని మొహాలీ వేదికగా హైదరాబాద్.. పంజాబ్ జట్లు తలపడేందుకు సిద్ధమైయ్యాయి. ఐపీఎల్ 2019లో భాగంగా జరుగుతోన్న ఈ పోరులో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు 3 విజయాలు, 2 ఓటములతో సమానంగా 6 పాయింట్లతో బరిలోకి దిగుతుండగా ఈ ఫైట్ టఫ్ గా మారనుంది.
ఇదే వేదికగా గతంలో జరిగిన మ్యాచ్ లలో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టే ఎక్కువ సార్లు గెలుపొందింది. చేధనలో 15 మ్యాచ్ లు ఆడిన జట్టు కేవలం 4 మ్యాచ్ లు మాత్రమే గెలుపొందింది.