SL vs BAN : బంగ్లాదేశ్ పై శ్రీలంక ఘన విజయం
ఆసియాకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో శ్రీలంక ఘన విజయం సాధించింది. 258 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 48.1వ ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది.

SL vs BAN
Sri Lanka vs Bangladesh : ఆసియాకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో శ్రీలంక ఘన విజయం సాధించింది. 258 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 48.1వ ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. దీంతో శ్రీలంక 21 పరుగుల తేడాతో గెలుపొందింది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హృదయ్ (82; 97 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్) ఒక్కడే అర్థశతకంతో రాణించాడు. మిగిలిన వారు విఫలం కావడంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు. శ్రీలంక బౌలర్లలో మహేశ్ తీక్షణ, ధసున్ శనక చెరో మూడు వికెట్లు, పతిరణ రెండు, దునిత్ వెల్లలాగే ఓ వికెట్ తీశాడు.
Shikhar Dhawan : జట్టుకు దూరం చేసినా.. ఆలయంలో శిఖర్ ధావన్ పూజలు.. ఏం కోరుకున్నాడో తెలుసా..?
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో సదీర సమరవిక్రమ (93; 72 బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్సర్లు), కుశాల్ మెండీస్ (50; 73 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్) అర్థశతకాలతో ఆకట్టుకున్నారు. పాతుమ్ నిస్సాంక (40), ధసున్ శనక (24)లు రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలోతస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్ చెరో మూడు వికెట్లు తీయగా, షోరిఫుల్ ఇస్లాం రెండు వికెట్లు తీశాడు.