T20 World Cup 2021: కివీస్ టార్గెట్ 111.. టాప్ స్కోరర్ రవీంద్ర జడేజా 26
వంద పరుగులకు కూడా చేరదనుకున్న టీమిండియా ఎట్టకేలకు 110 పరుగులు చేసింది. చివరి ఓవర్లో రవీంద్ర జడేజా 11పరుగులు చేశాడు. ఆరంభం నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొన్న టీమిండియా..

Team India Vs Nz
T20 World Cup 2021: వంద పరుగులకు కూడా చేరదనుకున్న టీమిండియా ఎట్టకేలకు 110 పరుగులు చేసింది. చివరి ఓవర్లో రవీంద్ర జడేజా 11పరుగులు చేశాడు. ఆరంభం నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొన్న టీమిండియా క్రీజులో నిలదొక్కుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో ఏ ఒక్క బ్యాట్స్మెన్ నిలకడ చూపించలేకపోయారు.
స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగనున్న కివీస్ చేజిక్కించుకునేలా కనిపిస్తుంది. టీమిండియా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తేనే జట్టు గట్టెక్కుతుంది.
ఇషాన్ కిషన్ (4), కేఎల్ రాహుల్ (18), రోహిత్ శర్మ (14) విరాట్ కోహ్లీ(9), రిషబ్ పంత్ (12), హార్దిక్ పాండ్యా(23), రవీంద్ర జడేజా(26), శార్దూల్ ఠాకూర్ (0), మొహమ్మద్ షమీ (0)తో ఇన్నింగ్స్ ముగించారు. జడేజా, షమీ నాటౌట్ లుగా చివరి వరకూ క్రీజులో ఉన్నారు. బౌల్ట్ 3, సౌథీ, మిల్నే చెరో వికెట్ పడగొట్టారు.
…………………………………..: విశాఖలో పవన్ ర్యాలీ.. వెల్లువలా కదలిన జన సైనికులు