T20 World Cup 2021: సెమీ ఫైనల్ మ్యాచ్‌ ముందు పాకిస్తాన్ జట్టుకు షాక్

సెమీ ఫైనల్ 2 పోరాటంలో గెలిచి కివీస్‌తో తలపడేందుకు పాకిస్తాన్.. ఆస్ట్రేలియాలు రెడీ అయిపోయాయి. గురువారం సాయంత్రం దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ జట్టుకు..

T20 World Cup 2021: సెమీ ఫైనల్ మ్యాచ్‌ ముందు పాకిస్తాన్ జట్టుకు షాక్

Pakistan Team

Updated On : November 11, 2021 / 1:59 PM IST

T20 World Cup 2021: సెమీ ఫైనల్ 1వ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో తలపడిన న్యూజిలాండ్ ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుని నవంబర్ 14న జరగనున్న మ్యాచ్ కు రెడీ అయిపోయింది. ఇదిలా ఉంటే సెమీ ఫైనల్ 2 పోరాటంలో గెలిచి కివీస్‌తో తలపడేందుకు పాకిస్తాన్.. ఆస్ట్రేలియాలు రెడీ అయిపోయాయి. గురువారం సాయంత్రం దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ జట్టుకు షాక్ ఎదురైంది.

జట్టులో కీలకమైన ఇద్దరు ప్లేయర్లు ఆటకు దూరం కానున్నారు. జట్టు స్టార్‌ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్ ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇద్దరు రెండ్రోజులుగా ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నారు. ఐసీసీ నేతృత్వంలో వీరిద్దరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. రిజల్ట్ నెగిటివ్‌గా వచ్చినప్పటికీ ఇద్దరు ఆటగాళ్లు బుధవారం ప్రాక్టీస్ సెషన్‌కు దూరమయ్యారు.

పూర్తిగా కోలుకోకపోతే ఈ మ్యాచ్‌లో రిజ్వాన్‌, షోయబ్‌ మాలిక్‌ అందుబాటులో ఉండరని భావిస్తున్నారు. ఒకవేళ మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్ అందుబాటులో లేకపోతే వారి స్ధానంలో సర్ఫరాజ్ అహ్మద్, హైదర్ అలీకు తుది జట్టులో అవకాశం కల్పిస్తారు. ముందస్తు జాగ్రత్తగా వీరిద్దరిని మ్యాచ్‌కు సిద్ధంగా ఉండాలని పీసీబీ నుంచి ఆదేశాలు అందినట్లు పాక్ జట్టు వర్గాలు చెబుతున్నాయి.

…………………………………………… : బిగ్ బాస్ లో సూసైడ్ అటెంప్ట్ చేసిన కంటెస్టెంట్

ప్రస్తుత టోర్నమెంట్‌లో రిజ్వాన్, మాలిక్ పాకిస్తాన్‌ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2021 టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. నవంబర్ 11న (గురువారం) పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌ వేదికగా జరగనుంది.