ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ హైలెట్స్ చూశారా..? వీడియో వైరల్

టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ శనివారం ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ కు సంబంధించిన హైలెట్స్ ఇక్కడ వీడియోలో చూడొచ్చు..

ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ హైలెట్స్ చూశారా..? వీడియో వైరల్

Team india

Updated On : June 30, 2024 / 9:15 AM IST

T20 World Cup 2024 final : టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ శనివారం ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగింది. నాటకీయ మలుపులు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేపుతూ సాగిన మ్యాచ్ లో చివరికి టీమిండియాను విజయం వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత ఓవర్లలో 176 పరుగులు చేసింది. 177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు విజయం కోసం చివరి వరకు పోరాటం చేసింది. కానీ, నిర్ణీత ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఏడు పరుగుల తేడాతో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నితాకాయి. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ కు సంబంధించిన హైలెట్స్ వీడియోను ఐసీసీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. ఓసారి మీరు మ్యాచ్ లో హైలెట్స్ ను చూసేయండి..

Also Read : చరిత్రలో నిలిచిపోయే క్యాచ్..! కళ్లు చెదిరే క్యాచ్ తో టీమిండియాను గెలిపించిన సూర్య.. వీడియో వైరల్

 

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)