RCB : క‌ప్పు గెలిచిన ఆనందంలో ఉన్న ఆర్‌సీబీకి బిగ్ షాక్‌..

ఎట్ట‌కేల‌కు ఐపీఎల్ ట్రోఫీని సాధించామ‌ని ఆనందంలో ఉన్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ టీమ్‌, వారి ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ త‌గిలింది

RCB : క‌ప్పు గెలిచిన ఆనందంలో ఉన్న ఆర్‌సీబీకి బిగ్ షాక్‌..

Courtesy BCCI

Updated On : June 4, 2025 / 2:38 PM IST

ఎట్ట‌కేల‌కు ఐపీఎల్ ట్రోఫీని సాధించామ‌ని ఆనందంలో ఉన్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ టీమ్‌, వారి ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ త‌గిలింది. తొలిసారి ఐపీఎల్ క‌ప్పును గెలవ‌డంతో బెంగ‌ళూరు న‌గ‌రంలో ఆర్‌సీబీ టీమ్‌తో విక్టరీ ప‌రేడ్ నిర్వ‌హించాల‌ని ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ భావించింది. ఈ క్ర‌మంలోనే ఈ రోజు (బుధ‌వారం) మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు విక్ట‌రీ ప‌రేడ్‌ను, సాయంత్రం 6 గంట‌ల‌కు చిన్న‌స్వామి స్టేడియంలో సెల‌బ్రేష‌న్స్ ప్లాన్ చేశారు.

WTC 2023-25 Team of the Tournament : డ‌బ్ల్యూటీసీ 2023-25 టీమ్ ఆఫ్ ది టోర్న‌మెంట్‌.. భార‌త్ నుంచి ఇద్ద‌రికే చోటు..

అయితే.. పోలీసులు పెద్ద షాక్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. విక్ట‌రీ ప‌రేడ్‌కు బెంగ‌ళూరు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని స‌మాచారం. వ‌ర్కింగ్ డే కావ‌డంతో న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య ఏర్ప‌డుతుంద‌ని చెప్పార‌ట‌. ఈ క్ర‌మంలో విక్ట‌రీ ప‌రేడ్‌ను ర‌ద్దు చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త విన్న ఆర్‌సీబీ అభిమానులు నిరాశ‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

Virat Kohli-Rajat Patidar : ర‌జ‌త్ పాటిదార్‌కు సూప‌ర్ గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ.. ఆనందంలో ఆర్‌సీబీ కెప్టెన్ ఏం చేశాడంటే..?

ఇప్పుడు కేవ‌లం చిన్న‌స్వామి స్టేడియంలో సెల‌బ్రేష‌న్స్ మాత్ర‌మే నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి పాసులు ఉన్న‌వారినే అనుమతించ‌నున్నారు. పార్కింగ్ స‌మ‌స్య త‌లెత్త‌కుండా ప్ర‌జా ర‌వాణాను ఉప‌యోగించుకోవాల‌ని పోలీసులు సూచిస్తున్నారు. బెంగ‌ళూరులోని సీబీడీ ప్రాంతం వైపు మ‌ధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు పోలీసులు సూచించారు.