IND vs SL 2nd T20: సంజూ శాంసన్ దురదృష్టం.. ఆ యువ క్రికెటర్‌కు కలిసొస్తుందా?
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేలోపే గాయం రూపంలో సంజూకు దురదృష్టం వెంటాడింది. అయితే, సంజూ దురదృష్టం రాహుల్ త్రిపాఠికి అదృష్టంగా మారుతుందా అన్నచర్చ సాగుతుంది.

India vs srilanka
IND vs SL 2nd T20: ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ రెండో టీ20మ్యాచ్ పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతుంది. రాత్రి 7గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో స్వల్ప మార్పులతో టీమిండియా బరిలోకి దిగనుంది. తొలి టీ20లో ఆడిన వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ గాయం కారణంగా రాబోయే రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతని స్థానంలో జితేష్ శర్మను జట్టులోకి తీసుకున్నారు. అయితే, అతన్ని తుదిజట్టులో ఎంపిక చేసే అవకాశం చాలా తక్కువ.
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేలోపే గాయం రూపంలో సంజూకు దురదృష్టం పట్టుకుందని అభిమానులు పేర్కొంటున్నారు. అయితే, సంజూ దురదృష్టం రాహుల్ త్రిపాఠికి అదృష్టం రూపంలో కలిసొస్తుందా అనేచర్చ ప్రస్తుతం సాగుతుంది. సంజూ స్థానంలో ఈ రోజు జరిగే రెండో టీ20లో త్రిపాఠికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అదేజరిగితే రాహుల్ త్రిపాఠి టీ20ల్లో టీమిండియా తరపున అరంగ్రేటం చేస్తాడు.
Team India Vs Sri Lanka : వాట్ ఏ క్యాచ్.. శ్రీలంక ఫీల్డర్ అద్భుత ప్రదర్శన
రాహుల్ త్రిపాఠికి దేశీవాళి మ్యాచ్ లలో మంచి రికార్డు ఉంది. అయితే ఇండియా తరపున ఎప్పుడూ ఆడలేదు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. 76 మ్యాచ్‌లలో త్రిపాఠి 1798 పరుగులు చేశాడు. అందులో 10 అర్థం సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా రాహుల్ 52 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 2,728 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, 14 అర్థ సెంచరీలు ఉన్నాయి. అనుభవం కలిగిన ఆటగాడే కాకుండా రాహుల్ త్రిపాఠి ప్రస్తుతం ఫామ్ లో ఉన్నాడు. దీంతో తుదిజట్టులో త్రిపాఠికి అవకాశం లభిస్తుందని మాజీ క్రికెట్లుసైతం భావిస్తున్నారు. అదే జరిగితే సంజూ దురదృష్టాన్ని రాహుల్ త్రిపాఠి అదృష్టంగా మార్చుకుంటాడా లేదా వేచిచూడాల్సిందే.