హైదరాబాద్ ఓటమిపై కన్నీరుకార్చిన కోచ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ టామ్ మూడీ మ్యాచ్ ఓటమి అనంతరం కన్నీటి పర్యంతమయ్యాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను హైదరాబాద్ 2వికెట్ల వ్యత్యాసంతో చేజార్చుకుంది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 163 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.
నాలుగో వికెట్‌గా దిగిన పంత్‌పై అంచనాలు లేకపోవడంతో యువ క్రికెటర్ హిట్టింగ్ చూసి హైదరాబాద్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఇదే సమయంలో హైదరాబాద్ జట్టు కోచ్ టామ్ మూడీ కన్నీరు కార్చేశాడు. కేవలం గేమ్‌గా భావిస్తే అంత ఫీల్ అయ్యేవాడు కాదేమో.. అంతకుమించి అనుకున్నాడు కాబట్టే ఇంత ఎమోషనల్ అయ్యాడు.
లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన పృథ్వీ షా(56; 38బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సులు)తో మెరుపులు కురిపించాడు. ఢిల్లీపై బౌలింగ్ అస్త్రాన్ని ఎక్కుపెట్టిన విలియమ్సన్ సేనకు తొలి వికెట్‌గా శిఖర్ ధావన్(17) తర్వాత శ్రేయస్ అయ్యర్(8) చిక్కారు. అయినప్పటికీ పరుగుల వరదను కట్టడి చేయలేకోపోయింది. ఈ క్రమంలో 10.6ఓవర్‌కు ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో విజయ్ శంకర్ క్యాచ్ అందుకోవడంతో షా వెనుదిరిగాడు.
అప్పటి నుంచి ఇన్నింగ్స్ నడిపించే భారం పంత్ తీసుకున్నాడు. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న పరిస్థితుల్లోనూ తడబాటు కనిపించకుండా బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని దగ్గర చేశాడు. (49; 21బంతుల్లో 2ఫోర్లు, 5సిక్సులు)తో దాదాపు టార్గెట్ రీచ్ అవుతుందనుకున్న వేళ భువీ చేతికి చిక్కి వెనుదిరిగాడు. అప్పటికే స్కోరు 158 పరుగులకు చేరింది. మిగిలిన లాంచనాన్ని కీమో పాల్(5)పూర్తి చేశాడు.
Tom Moody. ?? pic.twitter.com/FACKulM7KB
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 8, 2019