U19 World Cup 2026 : విహాన్ మల్హోత్రా సెంచరీ.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్ ఉంచిన టీమ్ఇండియా
విహాన్ మల్హోత్రా సెంచరీ చేయడంతో అండర్-19 ప్రపంచకప్‌లో (U19 World Cup 2026) జింబాబ్వే ముందు టీమ్ఇండియా భారీ టార్గెట్ ఉంచింది.
U19 World Cup 2026 Team india batter Vihaan Malhotra century Zimbabwe target is 353
U19 World Cup 2026 : అండర్ -19 ప్రపంచకప్ 2026లో టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు విహాన్ మల్హోత్రా (109 నాటౌట్; 107 బంతుల్లో 7 ఫోర్లు) శతకంతో చెలరేగాడు. మంగళవారం సూపర్ సిక్స్‌లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో విహాన్ సెంచరీ చేయడంతో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. దీంతో జింబాబ్వే ముందు 353 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది.
𝗛𝗨𝗡𝗗𝗥𝗘𝗗 💯
Vihaan Malhotra rises to the occasion with a well-structured knock 👏 👏
Scorecard ▶️https://t.co/juFENSDomr #U19WorldCup pic.twitter.com/sL1ozP7asg
— BCCI (@BCCI) January 27, 2026
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్‌ను పాక్ బహిష్కరిస్తే ఐసీసీ తీసుకునే చర్యలు ఇవే..?
మిగిలిన భారత బ్యాటర్లలో అభిజ్ఞాన్ కుందు (61; 62 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (52; 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్థశతకాలతో రాణించారు. ఆరోన్ జార్జ్ (23), ఆయుష్ మాత్రే (21), అంబరీష్ (21), వేదాంత్ త్రివేది (15)లు పర్వాలేదనిపించారు. జింబాబ్వే బౌలర్లలో చిముగోరో మూడు వికెట్లు తీశాడు. పనాషే మజై, సింబరాషే చెరో రెండు వికెట్లు పడగొట్టాడు. ధ్రువ్ పటేల్ ఓ వికెట్ తీశాడు.
Innings Break!
Vihaan Malhotra’s brilliant century leads India U19’s charge against Zimbabwe U19 in the Super Six clash 💯👊
Over to our bowlers as we defend 3⃣5⃣2⃣ runs 🎯
Scorecard ▶️https://t.co/juFENSDomr #U19WorldCup pic.twitter.com/f4YB9ulNkB
— BCCI (@BCCI) January 27, 2026
