ఐపీఎల్ నుంచి తప్పుకున్న వరుణ్ చక్రవర్తి

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లీగ్ నుంచి తప్పుకున్నాడు. బుధవారం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2019 సీజన్లో అత్యధికంగా రూ.8.40కోట్లు పలికిన చక్రవర్తి.. కొండంత ఆశలతో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. మార్చిలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఒకేఒక్క మ్యాచ్‌లో ఆడిన వరుణ్ చక్రవర్తి 1/35 ప్రదర్శన చేశాడు.
చెన్నైలో ఆడాల్సిన మ్యాచ్‌కు ముందే వేలికి గాయం అవడంతో కొద్ది వారాల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. దాదాపు లీగ్ దశ పూర్తి కావస్తున్నా గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ సీజన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మేనేజ్‌మెంట్ మీడియాతో మాట్లాడుతూ.. లీగ్ ముగియకముందే వరుణ్ చక్రవర్తి కోలుకుని తిరిగి వస్తాడని ఆశిస్తున్నాం. ఇన్ని రోజులుగా ఎదురుచూసినా అతను గాయం నుంచి కోలుకున్నట్లుగా కనిపించలేదు. అందుకనే ఇంటికి వెళ్లిపోతున్నాడు. త్వరలోనే వేగంగా కోలుకుంటాడని ఆశిస్తున్నాం’ అని తెలిపింది.
Also Read : CSKvsDC: ఢిల్లీని శాసించిన చెన్నై, 80 పరుగుల తేడాతో భారీ విజయం