Vijayashanti : వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ జట్టు ఓటమిపై విజయశాంతి ట్వీట్ వైరల్

ఎన్నో లీగ్ గేమ్స్, సెమీస్ భారత్ అవలీలగా గెలుస్తూ వచ్చింది. వరల్డ్ కప్ 2023 టోర్నీలో 10 మ్యాచ్ లలో వరుస విజయాలు సాధించింది. ఎన్నో విజయాల తర్వాతకూడా ఎక్కడో ఒక్క వైఫల్యం ఎవరికైనా బాధ కలిగిస్తుంది.

Vijayashanti :  వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ జట్టు ఓటమిపై విజయశాంతి ట్వీట్ వైరల్

Vijayashanthi

ODI World Cup 2023 : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో వ‌రుస విజ‌యాల‌తో ఫైన‌ల్‌కు చేరిన టీమ్ఇండియా ఆఖ‌రి మ్యాచ్‌లో ఓడిపోయిన విషయం తెలిసిందే. 12 ఏళ్ల త‌రువాత ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడే సువ‌ర్ణావ‌కాశాన్ని తృటిలో చేజార్చుకుంది. దీంతో కోట్లాది మంది భార‌తీయుల‌కు నిరాశ త‌ప్ప‌లేదు. భార‌త జ‌ట్టు ఓడిపోయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఫైన‌ల్ వ‌ర‌కు అద్వితీయ ఆట‌తీరును క‌న‌బ‌రిచిన రోహిత్ సేనకు మ‌ద్ద‌తుగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదిలాఉంటే కొందరు నెటిజన్లు టీమిండియా ఓటమిపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటి వారిపై కాంగ్రెస్ నేత విజయశాంతి ట్వీట్ చేశారు.

Also Read : Pro Kabaddi : కబడ్డీ కోసం కలిసిన బాలయ్య, టైగర్ ష్రాఫ్, కిచ్చ సుదీప్.. వీడియో అదిరిపోయిందిగా..

ఎన్నో లీగ్ గేమ్స్, సెమీస్ భారత్ అవలీలగా గెలుస్తూ వచ్చింది. వరల్డ్ కప్ 2023 టోర్నీలో 10 మ్యాచ్ లలో వరుస విజయాలు సాధించింది. ఎన్నో విజయాల తర్వాతకూడా ఎక్కడో ఒక్క వైఫల్యం ఎవరికైనా బాధ కలిగిస్తుందని విజయశాంతి అన్నారు. అన్ని మ్యాచ్ లు గెలిచి.. చివరి మ్యాచ్ లో ఓడిపోయిన భారత్ క్రికెట్ టీం, ప్లేయర్స్‌ను ట్రోలింగ్‌కి గురిచెయ్యడం, మాటలు అనడం సరికాదు. నిజానికి, 10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్స్‌కు వచ్చిన భారత్ ముందు ఆస్ట్రేలియా గెలిచిన మ్యాచ్‌లు ఎన్నిఅని విజయశాంతి ప్రశ్నించారు. అయితే, మిగతా కొన్నిపోటీల మాదిరిగా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ కూడా బెస్ట్ ఆఫ్ 3 అనే విధానం ప్రకారం నడిస్తే, నిజమైన ప్రతిభ ప్రజలకు మరింత తెలియవచ్చునని విజయశాంతి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

 

Also Read : PM Narendra Modi: డ్రెస్సింగ్ రూంకు వెళ్లి టీమిండియా సభ్యులను ఓదార్చిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్

 

ఇదిలాఉంటే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన టీమిండియా ప్లేయర్స్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఓదార్చారు. ఫైనల్ మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూంకు వెళ్లి టీమిండియా సభ్యులను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.