Hardik Pandya : బ్యాట్ సెల‌క్ష‌న్‌లో హార్దిక్‌కు సాయం చేస్తున్న ఈ బుడ్డోడు ఎవ‌రో తెలుసా?

టీమ్ఇండియా టెస్టు జ‌ట్టులో స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా భాగం కాక‌పోవ‌డంతో ప్ర‌స్తుతం అత‌డికి చాలా విరామం దొరికింది.

Hardik Pandya : బ్యాట్ సెల‌క్ష‌న్‌లో హార్దిక్‌కు సాయం చేస్తున్న ఈ బుడ్డోడు ఎవ‌రో తెలుసా?

Viral vido Hardik Shares Cricketing Knowledge With Son Agastya

Updated On : July 26, 2025 / 2:17 PM IST

టీమ్ఇండియా టెస్టు జ‌ట్టులో స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా భాగం కాక‌పోవ‌డంతో ప్ర‌స్తుతం అత‌డికి చాలా విరామం దొరికింది. ఈ స‌మ‌యాన్ని అత‌డు త‌న కొడుకు అగ‌స్త్య‌తో స‌ర‌దాగా గ‌డుపుతున్నాడు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ పాండ్యా త‌న సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.

ఒక నిమిషం 9 సెక‌న్లు ఉన్న ఈ వీడియోలో హార్దిక్ త‌న వ‌ద్ద ఉన్న బ్యాట్ల‌లో మూడు వేరే వేరే బ‌రువులు ఉన్న బ్యాట్ల‌ను తూకం వేశాడు. ఆ మూడింటిలో ఏది బ‌రువుగా ఉంది. ఏదీ తేలిక‌గా ఉందో చెప్పాల‌ని త‌న 5 ఏళ్ల కొడుకు అగ‌స్త్య‌ను అడుగుతాడు. ఇక అగ‌స్త్య కూడా చాలా చ‌క్క‌గా స‌మాధానం చెబుతాడు. అంతేకాదండోయ్ బ‌రువైన బ్యాట్‌తో సిక్స‌ర్లు కొట్ట‌వ‌చ్చున‌ని అంటాడు. కొడుకు ముద్దు మాట‌ల‌ను వింటూ హార్దిక్ సంతోషంగా క‌నిపించాడు.

ENG vs IND : వర్షం శుభ్‌మన్ గిల్ సేన‌ను కాపాడుతుందా? మాంచెస్టర్‌లో నాలుగో రోజు వాతావ‌ర‌ణ నివేదిక ఇదే..

ఇక ఈ వీడియోకి.. ‘నా బ్యాట్ సెల‌క్ష‌న్ గురించి నా స్థానిక క్రికెట్ నిపుణుడు అగ‌స్త్య నుంచి స‌ల‌హాలు తీసుకున్నాను.’అంటూ హార్దిక్ ఈ వీడియోకి క్యాప‌న్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

ENG vs IND : శుభ్‌మ‌న్ గిల్‌ను చిక్కుల్లో ప‌డేసిన బౌలింగ్ కోచ్.. అరెరె ఇప్పుడెలా సామీ..

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు హార్దిక్ నాయ‌క‌త్వం వ‌హించాడు. ఈ సీజ‌న్‌లో ముంబై ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించింది. క్వాలిఫ‌య‌ర్‌-2లో ఓడిపోవ‌డంతో ఈ సీజ‌న్ నుంచి నిష్ర్క‌మించారు. జ‌ట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చ‌డంలో హార్దిక్ కీల‌క పాత్ర పోషించాడు. 15 మ్యాచ్‌ల్లో 163.50 స్ట్రైక్ రేటుతో 224 ప‌రుగులు చేశాడు. బౌలింగ్‌లో 14 వికెట్లు తీశాడు.