కోహ్లీ మరో 6రన్స్ చేస్తే ధోనీ తర్వాత తానే..

కోహ్లీ మరో 6రన్స్ చేస్తే ధోనీ తర్వాత తానే..

Updated On : May 4, 2019 / 3:46 PM IST

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. జట్టు వైఫల్యాలు ఎదుర్కొన్నప్పటికీ వ్యక్తిగత రికార్డులలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్లేఆఫ్ రేసుకు అర్హత సాధించకపోవడంతో గ్రూప్ దశలో ఇంకా ఆడేందుకు వీలుంది ఒక్క మ్యాచ్‌లో మాత్రమే. చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగాల్సిన మ్యాచ్‌లోనే ఈ రికార్డు సాధించాలి. 

కెప్టెన్‌గా కోహ్లీ సాధించడానికి మరో 6పరుగులు మాత్రమే ఉంది. ఒకవేళ సాధిస్తే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తర్వాతి స్థానాన్ని కోహ్లీ దక్కించుకుంటాడు.  ధోనీ 4084పరుగులతో టాప్ 1 స్థానంలో ఉంటే, కోహ్లీ మాత్రం మరో 6పరుగులు చేసి 4వేల పరుగుల క్లబ్‌లో చేరనున్నాడు. 

విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో కెప్టెన్‌గా 2013నుంచి కొనసాగుతున్నాడు. ఐపీఎల్ మొత్తంలో 168 ఇన్నింగ్స్‌లు ఆడి 5396 పరుగులు చేశాడు. ఇందులో 36హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కానీ, ధోనీ ఆడిన సీజన్లలో కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే కెప్టెన్సీకి దూరంగా ఉన్నాడు. 2017లో రైజింగ్ పూనె సూపర్ జెయింట్స్ జట్టులో ఆడిన ధోనీ కెప్టెన్సీలో లేడు. 

ఇక ఈ సీజన్లో ఇంకా 36పరుగులు చేస్తే లీగ్ టాప్ స్కోరర్‌గా 488 పరుగులు దాటి నిలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ, ఇప్పటికే గ్రూప్ దశ ముగియడంతో చెన్నై బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ 523పరుగుల టాప్ స్కోర్‌ను దాటే అవకాశాల్లేనట్లే.