చేసిందంతా షమీనే.. అతణ్నే పొగడండి: కోహ్లీ

విరాట్ కోహ్లీ మరో సారి ధోనీ శిష్యుడు అనిపించుకున్నాడు. ఘనతను ప్లేయర్లకు అప్పగించి ఇండోర్ స్టేడియం వేదికగా అభిమానుల మనస్సులు గెలుచుకున్నాడు. తొలి టెస్టులో భాగంగా తొలి రోజు మ్యాచ్ లో బంగ్లా 150కే ఆలైట్ అయింది. ఇందులో షమీ మిగిలిన బౌలర్ల కంటే అధికంగా 3వికెట్లు పడగొట్టాడు. గురువారం జరిగిన ఈ మ్యాచ్ లో కోహ్లీ ఫీల్డింగ్ లో ఉండగా స్టేడియంలోని అభిమానులు కోహ్లీ.. కోహ్లీ అంటూ అరవడం మొదలుపెట్టారు.
దాంతో పొగడాల్సింది తనను కాదని, బౌలర్ ని అంటూ కోహ్లీ సైగలు చేస్తూ కనిపించాడు. ఈ వీడియోను బీసీసీఐ అధికారిక ట్విట్టర్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. కోహ్లీ అలా చెప్పిన కాసేపటికే ముష్ఫికర్ రహీమ్ 54వ ఓవర్లోని ఐదో బంతికి 43పరుగులతో వెనుదిరిగాడు. ఆ తర్వాత టీ బ్రేక్ తర్వాత మెహదీ హస్సన్ ను ఎల్బీడబ్ల్యూగా గోల్డెన్ డక్ చేశాడు షమీ.
తొలి రోజు ఆటలో షమీ 3/27తో మెప్పించాడు. అతనికి తోడుగా ఫేసర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ దండుకోవడంతో బంగ్లా 150పరుగులకే ఆల్ అవుట్ గా వెనుదిరిగింది.