Virat Kohli : 20 ఏళ్లుగా పదిలంగా ఉన్న సచిన్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ..
Virat Kohli breaks Sachin record : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. వాంఖడేలో న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు.

Virat Kohli breaks Sachin record
భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. వాంఖడేలో న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఓ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 79 పరుగులు చేయడం ద్వారా సచిన్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో సచిన్ 673 పరుగులు చేశాడు. దాదాపు 20 ఏళ్లుగా ఈ రికార్డు పదిలంగా ఉండగా తాజాగా కోహ్లీ దాన్ని బద్దలు కొట్టాడు.
ఒకే ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు..
విరాట్ కోహ్లీ – 674* (2023)
సచిన్ టెండూల్కర్ – 673 (2003)
మాథ్యూ హేడెన్ – 659 (2007)
రోహిత్ శర్మ – 648 (2019)
డేవిడ్ వార్నర్ – 647 (2019)
THE ? OF WORLD CRICKET…!!! pic.twitter.com/tDQKxbEdGW
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 15, 2023
ఓ ఎడిషన్‌లో అత్యధిక అర్ధశతకాలు..
ఈ మ్యాచ్‌లో హాప్ సెంచరీ చేయడం ద్వారా విరాట్ కోహ్లీ ఓ వన్డే ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక అర్ధశతకాలు బాదిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. కివీస్ తో మ్యాచులో యాభై పరుగులు పూర్తి చేయడం ద్వారా కోహ్లీ ఓ సింగిల్ ఎడిషన్ ప్రపంచకప్‌లో అత్యధిక సార్లు అర్ధశతకాలు బాదిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. తాజా అర్ధశతకంతో కలిపి ఈ ప్రపంచకప్‌లో కోహ్లీ ఎనిమిది సార్లు 50+ స్కోరు నమోదు చేశాడు. ఈ క్రమంలో సచిన్ (7), షకీబ్ అల్ హసన్ (7) ల రికార్డులను బద్దలు కొట్టాడు.
ఓ ప్రపంచకప్ ఎడిషన్ లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు బాదిన ఆటగాళ్లు వీరే..
విరాట్ కోహ్లీ (భారత్)- 8 సార్లు – 2023
సచిన్ టెండూల్కర్ (భారత్) – 7 సార్లు – 2003
షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) – 7 సార్లు – 2019
రోహిత్ శర్మ (భారత్) – 6 సార్లు – 2019
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) – 6 సార్లు – 2019
Rohit Sharma : క్రిస్‌గేల్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు
కుమార సంగక్కర రికార్డు బ్రేక్..
అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లు) కలిపి అత్యధిక సార్లు 50 ఫ్లస్ స్కోర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ చోటు సంపాదించాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 264 సార్లు 50 ఫ్లస్ స్కోర్లు సాధించాడు. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీలు సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వీరిద్దరు 217 సార్లు 50 50 ఫ్లస్ స్కోర్లు చేశారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్లు..
సచిన్ టెండూల్కర్ (భారత్) – 264
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 217
విరాట్ కోహ్లీ (భారత్) – 217
కుమార సంగక్కర (శ్రీలంక) – 216
జాక్వస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 211