అన్నీ ఆయనకే: ICC అవార్డుల్లో కోహ్లీ రికార్డులు
సర్ గార్ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ గెలుచుకున్న కోహ్లీ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ధ ఇయర్, ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను గెలుచుకుని 2018లో అత్యద్భుతమైన ఆటగాడిగా నిలిచాడు.

సర్ గార్ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ గెలుచుకున్న కోహ్లీ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ధ ఇయర్, ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను గెలుచుకుని 2018లో అత్యద్భుతమైన ఆటగాడిగా నిలిచాడు.
పరుగుల రారాజు, విధ్వంసాల సృష్టికర్త విరాట్ కోహ్లీ మరో చరిత్రకు నాంది పలికాడు. 2018 పురస్కరించుకుని ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో కోహ్లీ అన్ని ఫార్మాట్ల నుంచి అవార్డులు అందుకోని అదరహో అనిపించాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనను అసమాన ప్రతిభ చూపించి కోహ్లీ ద్వైపాక్షిక సిరీస్ విజయంతో ముగించాడు. సర్ గార్ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ గెలుచుకున్న కోహ్లీ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ధ ఇయర్, ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను గెలుచుకుని 2018లో అత్యద్భుతమైన ఆటగాడిగా నిలిచాడు.
ఈ ఏడాది 13 టెస్టులు ఆడిన కోహ్లీ ఐదు సెంచరీల సాయంతో 1322 పరుగులను 55.08యావరేజ్‌తో బాదాడు. 14వన్డేల్లో ఆరు సెంచరీల సాయంతో 1202పరుగులను చేశాడు. దాంతో పాటుగా టీ20 ఫార్మాట్లలో 10 మ్యాచ్‌లు ఆడి 211 పరుగులు పూర్తి చేశాడు.
ఈ అవార్డు అందుకోవడం పట్ల కోహ్లీ స్పందిస్తూ.. ‘ఇది అత్యద్భుతమైన విషయం. ఓ క్యాలెండర్ ఇయర్లో చేసిన కఠోర శ్రమకు ఇది నిదర్శనం. చాలా గొప్పగా భావిస్తున్నా. ఎంతో సంతోషంగా ఉంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందడం మామూలు విషయం కాదు. క్రికెటర్‌గా ఐసీసీ గుర్తించిందంటే గర్వంగా అనిపిస్తోంది. ఈ అవార్డులు ఇంకా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రేరణ ఇస్తాయి’ అని తెలిపాడు.
2018 సంవత్సరంలో కోహ్లీ చేసిన ప్రదర్శనకు గాను ఐసీసీ వన్డే కెప్టెన్ ఆఫ్ ద ఇయర్‌గా, ఐసీసీ టెస్ట్ కెప్టెన్ ఆఫ్ ద ఇయర్‌గా సత్కరిస్తూ ఐసీసీ జట్లను ప్రకటించింది. ఈ మేర మంగళవారం టెస్టు, వన్డే ఫార్మాట్లలో ఉత్తమ 11మందితో కూడిన జట్టును ప్రకటించింది. టెస్టు జట్టులో ఇద్దరు మాత్రమే భారత ప్లేయర్లు ఉండగా వారిలో విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్)లు కాగా జస్ప్రిత్ బుమ్రా మరో ప్లేయర్. అయితే వన్డే జట్టులో మాత్రం భారత్ నుంచి నలుగురు ప్లేయర్లకు స్థానం దక్కింది. వన్డే ఫార్మాట్‌లో ఓపెనర్‌గా రోహిత్ శర్మ, స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్; జస్ప్రిత్ బుమ్రాలు కెప్టెన్ కోహ్లీతో పాటు ఉన్నారు. మిగిలిన ప్లేయర్లలో ఇంగ్లాండ్ నుంచి జోరూట్ , జానీ బెయిర్ స్టో, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్2లు.