IPL 2025: పరుగెత్తుకుంటూ వెళ్లి అనుష్క శర్మను కౌగిలించుకున్న కోహ్లీ.. వెక్కివెక్కి ఏడుస్తుండగా ఆమె ఏం చేశారంటే..! వీడియో వైరల్

ఆర్సీబీ విజయం తరువాత మైదానంలో సంబురాల్లో మునిగిపోయిన విరాట్ కోహ్లీ ఆ తరువాత తన సతీమణి అనుష్క శర్మ వైపు పరుగెత్తుకుంటూ వెళ్లాడు.

IPL 2025: పరుగెత్తుకుంటూ వెళ్లి అనుష్క శర్మను కౌగిలించుకున్న కోహ్లీ.. వెక్కివెక్కి ఏడుస్తుండగా ఆమె ఏం చేశారంటే..! వీడియో వైరల్

Virat Kohli

Updated On : June 4, 2025 / 8:34 AM IST

IPL 2025 Winner: ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ మంగళవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో చివరికి ఆర్సీబీ విజేతగా నిలిచింది. దీంతో ఆర్సీబీ 18ఏళ్ల కల ఎట్టకేలకు నెరవేరింది. తొలిసారి ఐపీఎల్ టైటిల్ ను ఆ జట్టు ముద్దాడింది. ఈ విజయం అనంతరం ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు.

Also Read: IPL 2025 Final: ఫైనల్లో ఓటమి తరువాత శ్రేయాస్ అయ్యర్ కీలక కామెంట్స్.. అతని వల్లే ఓడాం..

ఆఖరి ఓవర్ అవుతున్నప్పటికీ ఆర్సీబీ విజయం లాంఛనం కావడంతో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ చిన్న పిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చాడు. చివరి బంతి పూర్తికాగానే మోకాళ్లపై కూర్చుని భావోద్వేగానికి గురయ్యాడు. మరోవైపు విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా స్టాండ్స్ లో అలాగే చేసింది. ఆర్సీబీ విజయంతో అనుష్క శర్మ తన భావోద్వేగాన్ని ఆపుకోలేక పోయింది. ఆనందంతో దూకి, ప్రైవేట్ బాక్స్ లో తన పక్కన ఉన్న వాళ్లతో సంబరాలు చేసుకుంది.

Also Read: ఐపీఎల్-2025 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన, అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బ్యాటర్లు, బౌలర్లు వీరే.. ఫ్రైజ్ మనీ ఎంతంటే?

ఆర్సీబీ విజయం తరువాత మైదానంలో సంబురాల్లో మునిగిపోయిన విరాట్ కోహ్లీ ఆ తరువాత తన సతీమణి అనుష్క శర్మ వైపు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. అనుష్క ను గట్టిగా హత్తుకున్నాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ వెక్కివెక్కి ఏడ్చాడు. అనుష్క శర్మ కూడా విరాట్ ను హత్తుకొని ఎమోషనల్ అయింది. విరాట్ తల నిమురుతూ, భుజం తడుతూ అభినందించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ తరువాత ఐపీఎల్ ట్రోఫీతో విరాట్, అనుష్క ఫొటోలు దిగారు.