Virat Kohli : కివీస్‌తో వన్డే సిరీస్.. సచిన్ రికార్డును బద్దలు కొట్టే దిశగా కోహ్లీ.. ఏంటో తెలుసా?
వన్డేల్లో న్యూజిలాండ్ పై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచేందుకు విరాట్ కోహ్లీకి మరో 94 పరుగులు అవసరం.
Virat Kohli need 94 runs to became Indian player most runs against New Zealand in ODIs
- జనవరి 11 నుంచి భారత్, కివీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్
- కోహ్లీకి 94 పరుగులు అవసరం
- కివీస్ పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా
Virat Kohli : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జనవరి 11 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వడోదర వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు వడోదరకు చేరుకుని ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాయి. కాగా.. ఈ సిరీస్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ విరాట్ కోహ్లీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
కివీస్ పై వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) మరో 94 పరుగులు చేస్తే.. ఆ జట్టు పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.
Bangladesh cricketers : స్పాన్సర్‌షిప్ కోల్పోనున్న బంగ్లా ప్లేయర్లు..?
సచిన్ 41 ఇన్నింగ్స్‌ల్లో 46.05 సగటుతో 1750 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 8 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక కోహ్లీ విషయాన్ని వస్తే.. ఇప్పటి వరకు అతడు 33 ఇన్నింగ్స్‌ల్లో 55.23 సగటుతో 1657 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, తొమ్మిది అర్థశతకాలు ఉన్నాయి.
ఇక ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ మూడో స్థానంలో ఉన్నాడు. అతడు కివీస్ పై 23 ఇన్నింగ్స్‌ల్లోనే 52.59 సగటుతో 1157 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, మూడు అర్థశతకాలు ఉన్నాయి.
WPL 2026 : ముంబై వర్సెస్ బెంగళూరు.. పిచ్ రిపోర్టు, హెడ్-టు-హెడ్ రికార్డులు ఇవే..
వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
* సచిన్ టెండూల్కర్ – 1750 పరుగులు
* విరాట్ కోహ్లీ – 1657 పరుగులు
* వీరేంద్ర సెహ్వాగ్ – 1157 పరుగులు
* మహ్మద్ అజారుద్దీన్ – 1118 పరుగులు
* సౌరవ్ గంగూలీ – 1079 పరుగులు
