తెలివి వాడితే బాగుండేది: బౌలర్లపై కోహ్లీ స్పందన
సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 5వికెట్ల తేడాతో ఓడిపోయింది. చేదనలో కోల్ కతాను కట్టడి చేయడంలో విఫలమైన బెంగళూరుకు ఓటమి తప్పలేదు.

సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 5వికెట్ల తేడాతో ఓడిపోయింది. చేదనలో కోల్ కతాను కట్టడి చేయడంలో విఫలమైన బెంగళూరుకు ఓటమి తప్పలేదు.
సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 5వికెట్ల తేడాతో ఓడిపోయింది. చేదనలో కోల్ కతాను కట్టడి చేయడంలో విఫలమైన బెంగళూరుకు ఓటమి తప్పలేదు. చివరి ఓవర్లలో బ్యాటింగ్ కు దిగిన ఆండ్రీ రస్సెల్ 13 బంతుల్లో 48 పరుగులు బాదడంతో లక్ష్యం చిన్నదైపోయింది. దాదాపు గెలిచేశామనుకుంటున్న తరుణంలో మ్యాచ్ చేజారింది. మిగిలి ఉన్న 22 బంతుల్లో 64 పరుగులు చేయాల్సి ఉంది. కానీ, అనూహ్యంగా రస్సెల్ విజృంభణ మ్యాచ్ చేజారేలా చేసింది.
Read Also : నా ముందు ఏ గ్రౌండ్ అయినా చిన్నదే..
ఈ ఓటమిపై బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇలా స్పందించాడు. ‘ఈ ఫలితాన్ని ఊహించలేదు. ఆఖరి 4 ఓవర్లు మేం చేసిన బౌలింగ్ అస్సలేం బాగాలేదు. ఇంకొంచెం తెలివిగా వ్యవహరించాల్సింది. ఒత్తిడిలో సరిగా బౌలింగ్ చేయలేకపోయారు. ఇలాంటి పరిస్థితులని పవర్ హిట్టర్స్ చాలా బాగా వాడుకుంటారు. ఇప్పుడు అదే జరిగింది’ అంటూ బౌలర్ల ప్రదర్శనపై అసహనం వ్యక్తం చేశాడు.
తమ బ్యాటింగ్ ప్రదర్శనపైనా స్పందించిన కోహ్లీ ..’బెంగళూరు ఇన్నింగ్స్ చివర్లో ఇంకొన్ని పరుగులుచేయాల్సి ఉంది. 20-25 పరుగులు ఇంకా చేస్తే గేమ్ ఇంకోలా ఉండేది. డివిలయర్స్ వైపు నుంచి ఇంకొన్ని పరుగులు ఆశించా. స్కోరు బోర్డుపై ఆ పరుగులు సరిపోవని ముందుగానే అనుకున్నా. ఆఖరి 4 ఓవర్లలో 75 సాధించకపోతే.. ప్రత్యర్థులు చేసే 100 పరుగులను అడ్డుకోలేం’ అని కోహ్లీ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.
Read Also : ఆర్బీబీ పతనమయ్యేలా చేసిన హైదరాబాద్ ప్లేయర్