మిస్టర్ కూల్ ఆటోగ్రాఫ్: అభిమానిని ఆనందపెట్టడం కోసం ధోనీ ఇలా

  • Published By: vamsi ,Published On : November 2, 2019 / 07:08 AM IST
మిస్టర్ కూల్ ఆటోగ్రాఫ్: అభిమానిని ఆనందపెట్టడం కోసం ధోనీ ఇలా

Updated On : November 2, 2019 / 7:08 AM IST

మహేంద్రసింగ్ ధోనీ, క్రికెట్ పరంగా ఆయన క్రియేట్ చేసిన రికార్డులు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ప్రపంచ కప్ మ్యాచ్‌లు తర్వాత ధోనీ క్రికెట్‌కు కాస్త గ్యాప్ ఇచ్చాడు. వరుసగా సిరీస్‌లకు దూరంగా ఉంటున్న ధోనీ లేటెస్ట్‌గా ఓ అభిమానికి గుర్తుండిపోయేలా ఆటోగ్రాఫ్ చేసి సంతోషపెట్టాడు.

రాంచీలో ఓ అభిమాని కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటర్‌బైక్ ట్యాంక్‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చి అభిమానికి గుర్తుండిపోయేలా చేశాడు. తనకు ఆటోగ్రాఫ్‌ ఇవ్వమని ఓ అభిమాని కోరగా తన బైక్‌పై మార్కర్‌తో ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. దీనిని ఓ వ్యక్తి వీడియో తీయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ధోనీకి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో బైక్‌లు అంటే కూడా అంతే ఇష్టం. మార్కెట్లోకి ఏ కొత్తరకం బైక్ వచ్చినా దానిని ఒకసారి నడపాలని అనుకుంటాడు. అయితే తన దగ్గరకు వచ్చిన అభిమానిని ఆనందపెట్టడం కోసం తను కొత్తగా తెచ్చుకున్న బైక్‌పై ఆటోగ్రాఫ్ పెట్టాడు. ధోనీ మోటర్ బైక్‌పై ఆటోగ్రాఫ్ చేస్తుండగా అభిమాని చాలా సంతోషపడిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీడియో చివర్లో జూమ్‌ చేస్తే ‘మహి’ అని కనిపిస్తుంది.