Ambati Rayudu : గాల్లోనే సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్.. అంబటి అదరహో.. షాకింగ్ వీడియో..!
Ambati Rayudu : ఐపీఎల్ 15వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. చెన్నై జట్టు ఆడిన మొదటి 4 మ్యాచ్‌లలో పరాజయం పాలైంది. RCBతో జరిగిన మ్యాచ్‌లో CSK తొలి విజయాన్ని అందుకుంది.

Watch Video Catch Of The Tournament Ambati Rayudu Takes Sensational One Handed Grab To Send Back Rcb's Akash Deep
Ambati Rayudu : ఐపీఎల్ 15వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. చెన్నై జట్టు ఆడిన మొదటి 4 మ్యాచ్‌లలో పరాజయం పాలైంది. రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే తొలి విజయాన్ని అందుకుంది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేయగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 193 పరుగులకే ఆలౌటైంది. దాంతో బెంగళూరుపై చెన్నై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శివమ్ దూబే, రాబిన్ ఉతప్ప అద్బుతంగా రాణించి చెన్నై విజయంలో కీలకంగా వ్యవహరించారు.
ఈ మ్యాచ్ సమయంలో అంబటి రాయుడు క్యాచ్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. గాల్లోనే డైవ్ చేసి బంతిని ఒంటి చేత్తో ఒడిసిపట్టాడు అంబటి రాయుడు. 16వ ఓవర్‌లో కెప్టెన్ రవీంద్ర జడేజా వేసిన బంతికి ఆర్‌సీబీ ఆటగాడు ఆకాశ్ దీప్ షాట్ కొట్టడంతో అంబటి రాయుడు గాల్లోకి డైవ్ చేసి బంతిని క్యాచ్ పట్టాడు. షార్ట్ కవర్ వద్ద నిలిచిన రాయుడు.. ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి ఆకాష్ దీప్ క్యాచ్‌ను సింగిల్ హ్యాండ్‌తో పట్టేసుకున్నాడు.
36 ఏళ్లలోనూ అంబటి రాయుడు ఫీల్డింగ్ అదుర్స్ అనిపించాడు.. అంబటి రాయుడు తన బ్యాట్‌తో రాణించలేదు. ఆడిన 4 మ్యాచ్‌ల్లో అంబటి 20.50 సగటుతో 82 పరుగులు మాత్రమే సాధించాడు. ఉతప్ప 50 బంతుల్లో 9 సిక్సర్లతో 88 పరుగులు చేయగా.. శివమ్ దూబే 46 బంతుల్లో 8 సిక్సర్లతో 95 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్‌లో మహిష్ తీక్షణ 4 వికెట్లు, జడేజా 3 వికెట్లు తీసుకున్నారు.
Ambati Rayudu – Catch of the Season ? What’s Your Thoughts ? @RayuduAmbati #CSKvsRCB #CSKvRCB #CSK #RCB #AmbatiRayudu #DUBE #MIvPBKS #MIvsPBKS #ShivamDube #MSDhoni #ViratKohli #IPL2022 #elclassico #CSKvsMI #CSKvMI pic.twitter.com/J8ReG6iTyl
— ???????? ??????? (@DevGarewal21) April 13, 2022
ఆర్సీబీ ఆటగాళ్లు చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లి వికెట్‌పై అధిక సమయంలో నిలబడలేకపోయారు. దాంతో ఆర్‌సీబీకి ఓటమి తప్పలేదు. గ్లెన్ మ్యాక్స్ వెల్ 11 బంతుల్లో 26 పరుగులకే చేతులేత్తేయగా.. షాబాజ్ అహ్మద్ 41 పరుగులు చేశాడు. అంబటి రాయుడు ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి బంతిని క్యాచ్ పట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : Celebrity Cricket : సెలబ్రిటీ క్రికెట్.. ఐపీఎల్ తరహాలో 7 ఓవర్ల మ్యాచ్.. సెమీ ఫైనల్, ఫైనల్ ఇవాళే..