భారత్, బంగ్లాలకు థ్యాంక్స్ చెప్పిన గంగూలీ

భారత్, బంగ్లాలకు థ్యాంక్స్ చెప్పిన గంగూలీ

Updated On : November 4, 2019 / 4:48 AM IST

బీసీసీఐ(బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ భారత్ తో పాటు బంగ్లాదేశ్ జట్లకు థ్యాంక్స్ చెప్పారు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20లో బంగ్లా శుభారంభాన్ని నమోదు చేసింది. ప్రతికూల వాతావరణంలో మాస్క్ లు కట్టుకుని ఆడి మనసులు గెలుచుకున్నారు. 

ప్రపంచంలోనే అత్యధిక కాలుష్య నగరంగా నమోదైన ఢిల్లీలో జరగాల్సిన మ్యాచ్ ఆడించొద్దంటూ ముందుగా గంగూలీకి పర్యావరణ వేత్తలు లేఖలా ద్వారా విన్నవించుకున్నారు. అయినప్పటికీ ముందుగా నిర్దేశించినట్లే మ్యాచ్ లు జరుగుతాయని చెప్పిన గంగూలీ అనుకున్న విధంగానే ముగించాడు. దీంతో తొలి టీ20 అనంతరం ట్విట్టర్ వేదికగా ఇరు జట్లకు థ్యాంక్స్ చెప్పాడు. 

‘ఈ ఆట ఆడినందుకు ఇరు జట్లకు థ్యాంక్స్. బంగ్లాదేశ్ బాగా ఆడింది’ అని గంగూలీ ట్వీట్ చేశాడు. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా విజయం దక్కించుకున్న బంగ్లా 1-0ఆధిక్యం దక్కించుకుంది. రెండో టీ20ని నవంబరు 7న గుజరాత్ లోని సౌరాష్ట్ర స్టేడియం వేదికగా ఆడనున్నారు.